షాకింగ్: ఐష్ ని ముద్దాడిన జర్నలిస్ట్

Journalist kisses Aishwarya Rai

12:42 PM ON 13th April, 2016 By Mirchi Vilas

Journalist kisses Aishwarya Rai

ఇదేమి చోద్యం అనుకుంటున్నారా? ఏం చేస్తాం, ఇలాంటి ఘటనలు అప్పడప్పుడూ జరిగిపోతుంటాయి. దీంతో మాజీ మిస్ వరల్డ్.. బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కి అనుకోని షాక్ తగిలింది. మీడియా ముందుకొచ్చిన ఆమెని ఓ ఫొటో జర్నలిస్ట్ ముద్దాడడంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. బ్రిటిష్ యువరాజు విలియమ్, యువరాణి కేట్ మిడిల్టన్ ఇండియా పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన ఓ చారిటీ గాలా డిన్నర్ కార్యక్రమంలో యువరాజు దంపతులతో పాటు, బాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు. దీనికి బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ కు కూడా ఇన్విటేషన్ రావడంతో ఆమె కార్యక్రమానికి హాజరైంది.

ఈ సందర్భంలో పలువురు ఫొటో జర్నలిస్టులు ఆమెను ఫొటోలు తీశారు. వీరిలో ఓ బ్రిటిష్ జర్నలిస్టు కూడా ఉన్నారు. విష్ చేయడంతో షేక్ హ్యాండ్ ఇచ్చిన ఐశ్వర్య చేతిని సదరు జర్నలిస్టు ముద్దు పెట్టేసుకున్నాడు. అయితే దీనిని అంతే జోవియల్ గా తీసుకుంది ఐష్. ఎవరి రూటు వారిది మరి.


English summary

Journalist kisses Aishwarya Rai. British journalist kisses Ex- Miss World and bollywood top heroine Aishwarya Rai.