'ఎన్టీఆర్‌' ఎకౌంట్‌ హ్యాక్‌ చేసేశారు!!

Jr.Ntr account was hacked

02:07 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

Jr.Ntr account was hacked

సాధారణంగా ఎకౌంట్‌ హ్యాకర్లు ఎవరివైనా సెలబ్రిటీలవో, లేక ఎవరైనా విఐపిలవో ఎకౌంట్లు హ్యాక్‌ చేస్తే అది వాళ్ళకి గొప్ప విషయంగా భావించి మీ ఎకౌంట్‌ హ్యాక్‌ చేశామని వాళ్ళకే మెసేజ్‌ చేస్తారు. లేదా వాళ్ల వాల్‌ పైన అసభ్యకరమైన మెసేజ్‌లో, అసభ్యకరమైన ఫోటోలో పెట్టి ఇబ్బంది పెడతూ ఉంటారు. అయితే ఈ హ్యాకర్లు మన టాలీవుడ్‌ హీరోల విషయంలో మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఇది వరకు టాలీవుడ్‌ హీరో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు విషయంలో హ్యాకర్లు విచిత్రంగా ప్రవర్తించగా, తాజాగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ విషయంలో కూడా ఇలానే విచిత్రంగా ప్రవర్తించారు.

అదేంటంటే 'నాన్నకు ప్రేమతో' సినిమాలోని పాటలు ఎప్పుడు విడుదలవుతాయో అంటూ తెల్ల మెహం వేసుకున్నట్లుగా పోస్ట్‌ కనిపించగానే అందరూ ఒక్కసారిగా ఖంగు తిన్నారు. అయితే దీనికి స్పందిస్తూ ఎన్టీఆర్‌ వెంటనే నా ఎకౌంట్‌ ఎవరో హ్యాక్‌ చేశారంటూ ట్వీట్‌ పెట్టాడు. ఇలా హ్యాకర్లు మన స్టార్లతో ఆడుకుంటున్నారు. కానీ ఇంత జరిగినా మన హీరోలు అకౌెంట్‌ హ్యాకింగ్‌ చేశారని సైబర్‌ క్రైమ్‌ ఆఫీస్‌లో ఎటువంటి ఫిర్యాదు చెయ్యకపోవడం గమనార్హం.

English summary

Young Tiger Ntr twitter account was hacked by hackers. This is now hot topic Tollywood.