లొంగిపోతా: అసాంజే

Julian Assange accepted to arrest him

05:17 PM ON 4th February, 2016 By Mirchi Vilas

Julian Assange accepted to arrest him

తన పిటిషన్‌ను ఐక్యరాజ్యసమితి కొట్టేస్తే బ్రిటన్ పోలీసుకు లొంగిపోతానని వికీలీక్స్ వ్యస్థాపకుడు జూలియన్ అసాంజే వెల్లడించారు. స్వీడన్‌లో అత్యాచారం కేసును ఎదుర్కొంటున్న అసాంజే 2012 నుంచి లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్నారు. అయితే ఆ కేసుకు సంబంధించి అతను 2014లో యూఎన్‌కు ఫిర్యాదు చేశాడు. దానిపై ఐక్యరాజ్యసమితి శుక్రవారం తీర్పును వెలువరించనుంది. అసాంజే స్వేచ్ఛపై యూఎన్ ప్యానెల్ ఆ తీర్పులో ప్రస్తావిస్తుంది. ఒకవేళ తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే బ్రిటన్ పోలీసుల ముందు లొంగిపోతానని అసాంజే తెలిపాడు.

ఒకవేళ తీర్పు అనుకూలంగా వస్తే తాను వెంటనే పాస్‌పోర్ట్‌ను పొందనున్నట్లు చెప్పాడు. ఆస్ట్రేలియాకు చెందిన అసాంజే కొన్నేళ్ల క్రితం అమెరికా ప్రభుత్వానికి చెందిన వేలాది రహస్య పత్రాలను విడుదల చేశాడు. దాంతో అప్పట్లో అతను అకస్మాత్తుగా వార్తల్లోకి ఎక్కాడు. అయితే అతనిపై స్వీడన్‌లో అత్యాచార కేసు నమోదైంది. అసాంజే తనను రేప్ చేసినట్లు ఓ యువతి ఫిర్యాదు చేసింది. దానిపై ప్రస్తుతం అతను కేసును ఎదుర్కొంటున్నాడు. ఒకవేళ స్వీడన్‌కు తనను అప్పగిస్తే, ఆ దేశం తనను అమెరికాకు అప్పగిస్తుందని అసాంజే అనుమానిస్తున్నాడు. అప్పుడు అమెరికా తనను ఉరి తీస్తుందని అతను అభిప్రాయపడ్డాడు.

వికీలీక్స్‌కు సంబంధం లేకుండా రేప్ కేసులో ఇరుక్కున్న అసాంజేపై స్వీడన్ 2010లో అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆ సమయంలో అసాంజే లండన్‌లో ఉన్నాడు. అరెస్ట్ వారెంట్‌పై వేసిన అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది. దాంతో అతను ఈక్వెడార్ ఎంబసీలో ఆశ్రయం పొందుతున్నాడు.

English summary

Julian Assange accepted to arrest him. Julian Assange says he will agree to be arrested by British police on Friday if an investigation by a UN panel into the legality of the WikiLeaks founder’s