ఈ ట్రైలర్‌కి ఒక్కరోజులో 2 కోట్లు వ్యూలు

Jungle book get 2 crore views in one day

10:49 AM ON 10th February, 2016 By Mirchi Vilas

Jungle book get 2 crore views in one day

డిస్నీ జంగిల్‌ బుక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా దీనికి అభిమానులు ఓ రేంజ్‌లో ఉన్నారు. ఒక అడవిలో తప్పిపోయిన చిన్నపిల్లవాడు అక్కడున్న మృగాలను ఎలా మంచి చేసుకుని ఆ అడవికి రారాజుగా ఎలా మారతాడో అనేది ఈ కథ సారాంశం. ఈ కథాంశంతో తెలుగులో చిరంజీవితో 'అడవిదొంగ' అనే చిత్రం కూడా తెరకెక్కించారు. హిందీలో కూడా 'జంగిల్‌' అనే చిత్రం తెరకెక్కింది. అయితే హాలీవుడ్‌లో మాత్రం ఈ కథతో యానిమేషన్‌లో మాత్రమే రూపొందింది. అయితే ఇప్పుడు ఈ కథను ఒక కొత్త రియలిస్టిక్‌ యానిమేషన్‌ ద్వారా మూగ్లీని అద్భుతంగా తెరకెక్కించారు. హాలీవుడ్ సూపర్‌హిట్ సీరీస్ 'ఐరన్‌ మేన్‌' దర్శకుడు జోన్‌ ఫెవ్రియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌ రెండు రోజుల క్రితమే విడుదలైంది.

విడుదలైన 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లు మంది ఈ ట్రైలర్‌ ని వీక్షించారు. నీల్‌సేథీ అనే నూతన నటుడు ఈ చిత్రంలో మోగ్లీగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి హాలీవుడ్‌ స్టార్‌ నటులు స్కార్లెట్‌ జాన్సన్‌, బిల్‌ ముర్రే, క్రిస్టోఫర్‌ వాకెన్‌ ఇంకా తదితరులు వాయిస్‌ ఓవర్‌ అందించారు. ఒక్కరోజులో ఇంత రికార్డు సృష్టించిన ఈ ట్రైలర్‌ని మీరు కూడా చూడండి.

English summary

Hollywood latest movie The Jungle Book movie get 2 crore views in 24 hours. This movie is directed by Ironman fame Jon Favreau.