అమెరికా కంటే ముందే.. జంగిల్‌బుక్‌

Jungle Book To Release Week Before India Than In US

04:03 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Jungle Book To Release Week Before India Than In US

జంగిల్ బుక్.. చిన్నారుల నుంచి పెద్దల వరకూ అందరినీ అలరించిన యానిమేషన్ మూవీ జంగిల్ బుక్. ఇందులోని మౌగ్లీ, బల్లూ మొదలైన క్యారెక్టర్ లు ఎంతో పాపులర్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రఖ్యాత డిస్నీ సంస్థ ఈ సరికొత్త జంగిల్‌ బుక్‌ సినిమాను నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా అమెరికా కంటే వారం ముందుగానే భారత్‌లో విడుదలకానుంది. భారత సంతతికి చెందిన బాలుడు నీల్‌ సేథి మౌగ్లి పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 8న భారత థియేటర్లలో సందడి చేయనుంది. అమెరికా కంటే వారం ముందుగా సినిమాను భారత్‌లో విడుదల చేయడం ఆనందంగా ఉందని డిస్నీ ఇండియా స్టూడియోస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమృత పాండే తెలిపారు. ఈ సినిమాకు ప్రముఖ హాలీవుడ్‌ నటులు బెన్‌ కింగ్‌స్లే, బిల్‌ ముర్రే, స్కార్లెట్‌ జాన్సన్‌, ఐద్రిస్‌ ఎల్బా, క్రిస్టోఫర్‌ వాకెన్‌లు గాత్రం అందించారు. ఈ సినిమా అడవిలో తప్పిపోయిన మౌగ్లీ అనే కుర్రాడి చుట్టూ తిరుగుతుంది. రుడ్‌యార్డ్‌ కిప్లింగ్‌ రాసిన కథ ఆధారంగా డిస్నీ ఈ సినిమా తీసింది.

English summary

The most awaited Hollywood movie of this year was Jungle Book.This movie was going to be release on a week before in India than in US.