మనోజ్ సినిమా సెట్ లో వివాదం... నిర్మాతపై దాడి!

Junior artists attack on Manchu Manoj producer in Vizag

11:52 AM ON 3rd August, 2016 By Mirchi Vilas

Junior artists attack on Manchu Manoj producer in Vizag

ఇంకా పేరు పెట్టని కొత్త చిత్రం ప్రస్తుతం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో హీరో మంచు మనోజ్. ఇక కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త నిర్మాతలు అచ్చిబాబు - ఎస్.ఎన్.రెడ్డిలు నిర్మిస్తున్నారు. అయితే ఆగస్టు 1న వైజాగ్ లో షూటింగ్ జరుగుతూ ఉండగా... సెట్ లో గొడవ చోటుచేసుకుందని తెలుస్తోంది. జూనియర్ ఆర్టిస్టులు కొందరు సెట్ మీదికి దాడికి వచ్చారనీ - నిర్మాతపై చేయి చేసుకున్నారని కూడా టాక్ వచ్చింది. కొంతమంది జూనియర్ ఆర్టిస్టుల వాదన ఏంటంటే.. ఈ చిత్ర నిర్మాతలు తమకు ఇస్తామన్న సొమ్మును ఇంకా ఇవ్వలేదని అంటున్నారు. రూ. 15 లక్షలు ఇస్తామని చెప్పి ఇంకా రూ. 5 లక్షలు మాత్రమే ఇచ్చారని అంటున్నారు.

ఇది అడిగేందుకు వెళ్తేనే గొడవ జరిగిందన్నది వారి వాదన. ఇంకో వెర్షన్ ఏంటంటే... ఫిల్మ్ ఫెడరేషన్ నియమ నింబంధనల ప్రకారమే నమోదు చేసుకున్న కొంతమంది జూనియర్ ఆర్టిస్టులకు సినిమాలో అవకాశం ఇచ్చారట. ఈ విషయం నచ్చనివారు మరికొంతమంది గుంపు సెట్ లోకి వచ్చి - తమకీ ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారట. అలా కుదరదు అని నిర్మాతలు - హీరో చెప్పడంతో వివాదం చెలరేగిందనీ, దీంతో వచ్చినవాళ్ళు రెచ్చిపోయి, సెట్ లో దాడికి దిగారని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపేందుకు హీరో మంచు మనోజ్ మీడియా ముందుకి రాబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ మధ్య కాలంలో ఇలాంటి వివాదాలు సహజం అయిపోయాయి.

English summary

Junior artists attack on Manchu Manoj producer in Vizag