తాతయ్య స్మరణే గెలుపు ......

Junior NTR About Senior NTR

01:38 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Junior NTR About Senior NTR

పదేపదే తాతయ్యను స్మరిస్తూ , చివరకు గెలుపుని సొంతం చేసుకున్నాడు జూనియర్. విషయమేమంటే, నాగార్జున మా టివిలో నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రియాల్టీ షోలో ఎన్టిఆర్ పాల్గొని 12న్నర లక్షలు గెలుచుకున్నాడు. ఈ షో లో ఎక్కువగా పెద్ద ఎన్టిఆర్ ని జూనియర్ ప్రస్తావిస్తూ పలు సంఘటనలు వివరించాడు. తన తాతయ్య డైలాగ్ ఆధారంగా ఈ షోలో ఓ ప్రశ్నకు జవాబు చెప్పేసి,ఆ జవాబు వల్ల అతను రూ.3.2 లక్షల నుంచి రూ.6.5 లక్షలకు చేరుకున్నాడు.

జూనియర్ రూ.3.2 లక్షలు గెలిచాక తర్వాతి ప్రశ్నగా ‘ద్రోణాచార్యుడి తండ్రి ఎవరు’ అని నాగ్ ప్రశ్న సంధించాడు. నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు. ఐతే ఎన్టీఆర్ కాసేపు ఆలోచించి భరద్వాజుడు అని బదులిచ్చాడు. చివరికి అదే కరెక్ట్ ఆన్సర్ అని తేలింది. ఇంతకీ ఈ జవాబు ఎలా ఇచ్చావు అని అడిగితే.. ఎన్టీఆర్ చెప్పిన తీరు ఇలా నడిచింది.

‘దాన వీర శూర కర్ణ’లో ఎన్టీఆర్ కులం గురించి చెప్పిన ఫేమస్ డైలాగ్ లో భాగంగా ‘నీ తండ్రి భరద్వాజుడి జననమెట్టిది’ అంటూ ద్రోణాచార్యుడిని ప్రశ్నిస్తాడు. ఈ డైలాగ్ గుర్తు తెచ్చుకుని తాను ఈ ప్రశ్నకు జవాబిచ్చినట్లు వెల్లడించాడు ఎన్టీఆర్. తారక్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ సూపర్బ్ అంటూ నాగ్ కితాబిచ్చేసాడు. మొత్తానికి తాతయ్య సినిమాలు బాగా చూడ్డం వల్ల ఆయన డైలాగులు గుర్తు పెట్టుకోవడం వల్ల జూనియర్ కి లాభం చేకూరింది. తాతయ్య స్మరణ మేలు చేసింది. ఇక ఇందులో వచ్చిన మొత్తాన్ని తాతయ్య ఎన్ టి ఆర్ ట్రస్ట్ సేవాకార్యక్రమాలకు వెచ్చిస్తానని కూడా జూనియర్ చెప్పడం కొసమెరుపు.

English summary

Junior NTR says about Senior NTR. Recently He participated in Nagarjuna's reality show Meelo Evaru Koteeswarudu(MEK)