జూనియర్ ఎన్టీఆర్ పాలిట శాపం

Junior NTR Career In Danger Because Of Politics

11:49 AM ON 4th April, 2016 By Mirchi Vilas

Junior NTR Career In Danger Because Of  Politics

ఒక్కోసారి స్నేహాలు అందలం ఎక్కిస్తే , మరోసారి కోలుకోలేని దెబ్బతీస్తాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టిఆర్ విషయంలో డ్యామేజ్ ఎక్కువగా జరుగుతోంది ...పైగా రాజకీయాలు చుట్టుముడితే ఎలాంటి వారినైనా కుంగదీస్తాయి .... ఆనాడూ కృష్ణాజిల్లా వేదికగా వెలిసిన ‘జూనియర్ ఎన్టీఆర్ – కొడాలి నాని’ ఫ్లెక్సీలపై జూనియర్ ఎలాంటి నోరు మెదపక పోవడంతో జరిగిన డ్యామేజ్ మాములుగా అయింది కాదు. అంతేకాదు స్వయంగా బాలకృష్ణ రంగంలోకి టిడిపికి ఎదురుగా వెళితే ‘ఎవడైనా అంతే…’ అంటూ ఒక పరోక్ష వార్నింగ్ కూడా అదే కృష్ణాజిల్లాలో ఇచ్చాడు. అయితే ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నింపాదిగా ప్రకటన చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మళ్ళీ అదే కృష్ణాజిల్లా వేదికగా… అదే కొడాలి నాని సాక్షిగా మళ్ళీ రాజకీయ కలకలం దుమారం రేపుతోంది.

ఇవి కుడా చదవండి :  

'ఊపిరి' నిర్మాతలు మోసం చేసారు:రాజా రవీంద్ర

సన్నితో నటించాలని ఉంది

1/9 Pages

హరికృష్ణతో నాని .... 

    తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఏకవచనంతో సంభోదిస్తూ అత్యంత హేయకరమైన రీతిలో మాట్లాడిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ ఒకే కారులో ఓ కార్యక్రమానికి హాజరవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై ఎలాంటి సంజాయిషీ గానీ, వివరణ గానీ ఇచ్చుకున్నా టిడిపి వర్గాలు శాంతించేలా కనపడడం లేదు. 

English summary

Junior NTR film career was going into dangerous position because of Politics. The incidents like flexi controversy with Kodali Nani,and Hari Krishna Travelled along with Kodali Nani in a single car etc.