అవి రూమర్స్ అంటున్న జూనియర్ ...

Junior NTR Denied The Rumours On Movie Release Date

11:38 AM ON 11th January, 2016 By Mirchi Vilas

Junior NTR Denied The Rumours On Movie Release Date

నందమూరి కుటుంబం నుంచి ఈ సంక్రాతికి రెండు భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయని అభిమానులు సందడి చేస్తున్నారు. అయితే ఎక్కడైనా బావ కానీ వంగ తోటకాడ కాదు అన్న చందంగా నందమూరి అభిమానుల నడుమ ఘర్షణ వాతావరణం ఏర్పడుతోందని వార్తలు షికారు చేస్తున్నాయి. పత్రికల్లో కధనాలు వచ్చాయి. చానెల్స్ లో కూడా చర్చ సాగింది. పైకి మాత్రం ఎలాంటి నెగిటివ్ లేకున్నా తెరవెనుక జరగాల్సినవన్నీ జరిగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఇదంతా రూమర్స్ అని జూనియర్ ఎన్ టి ఆర్ తేల్చేసారు. ఇంతకీ విషయంలోకి వస్తే ,
హిందూపురం ఎం ఎల్ ఎ , యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'డిక్టేటర్' సంక్రాతికి విడుదల చేయడానికి సన్నాహాలు జోరుగా పూర్తిచేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ముందు రోజు జూనియర్ ఎన్ టి ఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో' సినిమా కూడా విడుదల కాబోతోంది. ఇది కూడా డిక్టేటర్ అంత కాకపోయినా ఇంచుమించు అంతే స్థాయి బడ్జెట్ చిత్రమే. ఓ రకంగా నందమూరి అభిమానులకు పసందైన విందు లాంటిదే. కానీ అసలు చిక్క్కంతా ఇక్కడే వచ్చింది.

రాజకీయ జోక్యమా .....

బాలయ్య 'డిక్టేటర్' కోసం ముందు ఎన్ టి ఆర్ చిత్రాలు ప్రదర్శించే ధియేటర్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. ప్రస్తుతం వినిపిస్తున్న వాదన ప్రకారం, ముందురోజు 'నాన్నకు ప్రేమతో' వేసుకున్నా , మర్నాడు కుదరదట. ఇంకా బెట్టు చేస్తే అసలు ధియేటర్ లు ఇవ్వకుండా 'డిక్టేటర్' కోసం రిజర్వ్ చేస్తారట. దీంతో మంచి ధియేటర్లు దొరక్క 'నాన్నకు ప్రేమతో' ఇబ్బందుల్లో పడిందని ఒకటే టాక్. ఈ విషయంలో రాజకీయ నేతలు కూడా రంగ ప్రవేశం చేసినట్లు కూడా వార్తలు రావడం మరీ విడ్డూరం. బాలయ్య కోసం అధికార పార్టీ నేతలు చక్రం తిప్పుతున్నారట. అసలు అంత సీనుందా.
జూనియర్ తో ఆదినుంచీ ....

నిజానికి జూనియర్ ఎన్ టి ఆర్ కి బాలయ్యకు ముందు నుంచి అత్తిపోత్తులు లేవని, మధ్యలో అంతా కల్సినల్టు కనిపించినా , మళ్ళీ ఎవరికీ వారే యమునా తేరే అన్నట్లు ఉంటున్నారని ఇండస్ట్రీలో నే కాదు పబ్లిక్ టాక్ కూడా. దీనికి తోడూ రాజకీయాలు కూడా ఇందులో తొంగి చూస్తున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఎన్ టి ఆర్ టిడిపి కి కాకుండా జగన్ శిబిరానికి అనుకూలంగా వున్నారనే వాదన వుండేది. జూనియర్ ఎన్ టి ఆర్ తో సినిమాలు తీసిన ప్రధాన అనుచరుడు కొడాలి నాని వైస్సార్ పార్టీలోకి వెళ్ళడం వెనుక జూనియర్ ప్రోత్సాహం ఉందన్న ఆరోపణలు వున్నాయి. దీనికి తోడు 2009లో టిడిపికి ప్రచారం చేసిన జూనియర్ 2014 ఎన్నికల్లో కనిపించలేదు.

అంతా కలిసే వున్నారా ....

ఎన్నికల్లో టిడిపి గెలిచాక , చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హరికృష్ణతో పాటు తనయుడు జూనియర్ సహా నందమూరి కుటుంబం అంతా హాజరయ్యారు. అయితే, హరికృష్ణ పలు సందర్భాల్లో పెద్ద ఎన్ టి ఆర్ కి రాజకీయ వారసుడు జూనియర్ ఎన్ టి ఆర్ అనే అర్ధం వచ్చేట్టు మాట్లాడినట్లు వార్తలు షికారు చేసాయి. దీనికి తోడు రాజ్యసభకు హరికృష్ణను మళ్ళీ పంపకపోవడం కూడా చర్చకు దారితీసింది. 'ఏమీ లేకున్నా ఎందుకు చిలవలు పలవలు చేస్తారు. అసలు మా కుటుంబం పైనే ఎందుకు ఇలా జరుగుతోంది'అంటూ పలు సందర్భాల్లో మీడియా ప్రశ్నకు హరికృష్ణ ఎదురు ప్రశ్న వేస్తూ, నందమూరి కుటుంబంలో అంతా కల్సే ఉన్నామని , నందమూరి అభిమానులు కూడా ఐకమత్యంతో వున్నారని స్పష్టం చేసారు కూడా.

నిజంగా వత్తిళ్ళున్నాయా ...

అసలు 'డిక్టేటర్' కోసం 'నాన్నకు ప్రేమతో' పది రోజులు వాయిదా వేసుకోమ్మన్న వత్తిడి కూడా వచ్చినట్లు మరో టాక్ నడుస్తోంది. కానీ వీరిద్దరి ప్రభావం నాగ్ 'సోగ్గాడే చిన్ని నాయనే' మీద మాత్రం పడకపోవడం కూడా పలువురు ప్రస్తావిస్తూ, కేవలం జూనియర్ ని దెబ్బ తీయడానికే కుట్ర చేస్తున్నారని అంటున్నారు.

ఏమీ లేదని కొట్టి పారేస్తున్న జూనియర్ ...

ఇక స్వయంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'మా మధ్య పోటీ కానీ, నందమూరి ఫ్యాన్స్ మధ్య క్లాష్ కానీ లేనే లేదు. ఆ మాటకొస్తే, నాకు ఎవరితోనూ ఎలాంటి క్లాషూ ఉందని అనుకోవడం లేదు. బాబాయ్ సినిమా, నా సినిమా - ఇలా అందరి సినిమాలూ ఆడాలనే కోరుకుంటున్నా. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ రిలీజ్ ఉండగా నాగార్జున గారి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ షోలో, పాల్గొన్నాను. నా ఒక్కడి సినిమానే ఆడాలనుకుంటే, ఆ పని చేయను కదా! పండగ సీజన్‌లో రెండు సినిమాలూ వస్తుంటే, బాబాయ్కి- నాకు మనస్పర్థలు సృష్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. మా ఇద్దరి సినిమాలే కాదు... అందరి సినిమాలూ ఆడాలి. ఇక నా సినిమాకు దియటర్లు ఇవ్వడం లేదనే వార్తలు రావడం విచారకరం. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే మా నిర్మాత చెబుతారు కదా. అయితే నాకేమీ చెప్పలేదు. అలాంటప్పుడు రూమర్స్! కాక మరేమిటి' అంటూ జూనియర్ వివరించారు.

జూనియర్ చెప్పేది నిజమైతే, ఈనెల 13, 14 తేదీల్లో ఈ రెండు సినిమాల విడుదల తర్వాత పరిణామాలు సజావుగా ఉంటాయని భావించవచ్చా.

English summary

Junior NTR denies the Rumours on the release date of his upcoming film nannaku prematho.He says that there were no issues in with his family members