పేరు పెట్టి పిలిస్తే భయపడుతున్న ఎన్టీఆర్ ...

Junior NTR Says That He Will Be Afraid Of His Name

10:43 AM ON 31st August, 2016 By Mirchi Vilas

Junior NTR Says That He Will Be Afraid Of His Name

ఇదేమిటి, పెద్దలు పెట్టిన పేరు పెట్టి పిలిస్తే ఆనంద పడాలి తప్ప భయపడడం ఏమిటబ్బా? అవును, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఆ పేరుతో పిలిపించుకునేందుకు ససేమిరా ఇష్టపడరా? అలా పిలిస్తే భయపడి పోతాడట. స్వయంగా అతనే ఈ విషయం వెల్లడించాడు. ఇక రిలీజ్ కి దగ్గరపడ్డ జనతాగ్యారేజ్ ప్రమోషన్ తో చాలా బిజీగా టైమ్ గడుపుతున్న జూనియర్, ఇందులోభాగంగా ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పాడు.

పనిలోపనిగా తన పేరుపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. మిమ్మల్ని ఎన్టీఆర్ అని పిలిస్తే ఇష్టమా? లేక తారక్ అని అంటే ఇష్టమా ? అని అడిగితే ఒక బ్రేక్ ఇచ్చిన తరువాత ఎన్టీఆర్ ఒక షాకింగ్ రిప్లై ఇచ్చాడు. తన వరకు తనని ఎన్టీఆర్ అని పిలిస్తే కొద్దిగా భయం వేస్తుందనీ, అంత పెద్దమనిషి పేరు పెట్టుకుని పిలిపించుకోవాలంటే కొద్దిగా భయం వేస్తుందని చెప్పాడు. ఇప్పటికీ అమ్మ, సన్నిహితులు, స్నేహితులు అంతా తారక్ అనే పిలుస్తారని చెప్పాడు.

తనకు కూడా తారక్ అని పిలిస్తేనే ఇష్టమని మనసులో మాటను బయటపెట్టిన జూనియర్, ఎన్టీఆర్ లాంటి మహానుభావుడి పేరు తనకు పెట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని అయితే ఆ పేరుతో పిలిపించుకునేటంత అర్హత లేదని అన్నాడు. అంతేకాదు సీనియర్ ఎన్టీఆర్ ఎక్కిన 100 మెట్లలో కనీసం ఒకటో, రెండో మెట్లు ఎక్కడానికే ట్రై చేస్తున్నానంటూ తాత పై తన భక్తిని మరింతగా చాటుకున్నాడు.

ఇవి కూడా చదవండి:ఈ దేశాల్లో చనిపోయిన మనిషిని ఏం చేస్తారో తెలిస్తే షాకౌతారు!

ఇవి కూడా చదవండి:ఈ 10 రకాల అమ్మాయిలతో డేటింగ్ చాలా డేంజర్

English summary

Tollywood Young Tiger NTR was known for his dance,Acting and his Energetic performance and recently he acted in a film called Janata Garage and this movie was going to be released on September 1st and on a interview he said that he was afraid when some one calls his as NTR because his grand father NTR was great person and that's the reason he was afraid of his name.