చీఫ్ జస్టీస్ కంట తడి

Justice Thakur Crying Over Pending Pending Cases

11:17 AM ON 25th April, 2016 By Mirchi Vilas

Justice Thakur Crying Over Pending Pending Cases

సమాజంలో నెలకొన్న పరిస్థితులు , న్యాయస్థానాల్లో పేరుకుపోతున్న కేసులు వంటి అంశాలు తీవ్రరూపం దాల్చాయి. అందుకే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే భావోద్వేగానికి లోనై సాక్షాత్తూ కంటతడి పెట్టారు. న్యాయవ్యవస్థ మీద పని ఒత్తిడి తగ్గించడానికి, వ్యవస్థ పనితీరు మెరుగుపర్చడానికి తీసుకోవలసిన చర్యల విషయంలో పాలనా వ్యవస్థ క్రియాశూన్యంగా ఉండిపోవడాన్ని ఆయన ప్రధాని మోడీ దృష్టికి తెచ్చారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశం ఆదివారం డిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ గద్గద స్వరంతో ప్రసంగం ఆపేసి, కళ్లు తుడుచుకున్నారు. న్యాయస్థానాల ముందు పర్వతాల్లా పేరుకుపోతున్న కేసులను పరిష్కరించాలంటే ప్రస్తుతం 21 వేలు ఉన్న న్యాయమూర్తుల సంఖ్యను 40వేలకు పెంచాలని చీఫ్ జస్టీస్ సూచించగా ప్రధాని మోడీ సానుకూలంగా స్పందిస్తూ, న్యాయవ్యవస్థతో కలిసి కేంద్రం తప్పక ఈ సమస్యను పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి: రెండు రోజుల్లో 2.60 కోట్ల మంది చూసిన వీడియో

పలు రకాల వివాదాలతో న్యాయస్థానాల ముందుకు వస్తున్న ప్రజలకోసమో, ఏళ్ల తరబడి కేసులు పరిష్కారం కాక జైళ్లలో మగ్గుతున్న వారికోసమో మాత్రమే కాదని... దేశ అభివృద్ధికోసం సందర్భానికి తగినట్లుగా స్పందించాలని, బరువంతా న్యాయవ్యవస్థపై వేయడం తగదని జస్టిస్‌ ఠాకూర్‌ గద్గద స్వరంతో అన్నారు. 1987లో లా కమిషన్‌ సిఫార్సులను గుర్తుచేశారు. పది లక్షల జనాభాకి పది మందిగా ఉన్న న్యాయమూర్తుల సంఖ్యను 50కి పెంచాలని సిఫార్సు చేయగా ఇంతవరకూ దానిపై ఎలాంటి చర్యా తీసుకోలేదన్నారు. ఆ తర్వాత కూడా ఈ విషయంపై పలు సిఫార్సులు ప్రభుత్వం ముందుకు వచ్చిన సంగతి ఆయన గుర్తుచేశారు. 1987లోనే 40 వేల మంది న్యాయమూర్తుల అవసరం ఉండేదని, ఆ తర్వాత జనాభా పాతిక కోట్లు పెరిగిందని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి: బోయపాటిని వెంటాడిన హిజ్రాలు

ఇవి కూడా చదవండి:బావ నటన సూపర్బ్...

English summary

Supreme Court chief justice TS Thakur has cried in front of PM Narendra Modi, while he was addressing chief ministers and justices of High Courts.