జస్టీన్ బీబర్ని కదిలించిన సంఘటన..

Justin Bieber writes note for his friend

10:34 AM ON 19th November, 2015 By Mirchi Vilas

Justin Bieber writes note for his friend

ప్రపంచాన్ని గడగడలాడించిన పారిస్ మారణహోమం ఎంతో మందిని పొట్టనబెట్టుకుంది. ఈ ఘటనలో ఎంతో మంది తమతమ ఆప్తులను కోల్పోయారు. వందలాది మందిని పొట్టన పెట్టుకున్న ఈ ఉగ్రవాద ఘటనలో తనవారిని కోల్పోయిన వారి ఆవేదన మాటలకు చిక్కనిది. ఇప్పుడు ఇలా తన ఆత్మీయుడిని కోల్పోయిన వారి జాబితాలో ఒక సెలెబ్రిటీ కూడా చేరారు. ఆ సెలబ్రిటీ మరెవరో కాదు... ప్రపంచాన్ని తన పాప్ మ్యూజిక్తో ఓలలాడిస్తున్న జస్టిన్ బీబర్.

ఆరోజు జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది అమాయకులలో జస్టీన్‌ బీబర్‌ స్నేహితుడు ఉండటం అతనిని ఎంతగానో కదిలించింది. అతని స్నేహితుడు థామస్‌ కోసం కుంగి పోయారు. థామస్‌ తనకి చాలా సహాయం చేసారని, చాలా మిస్‌ అవుతున్నానని ఆయన తెలిపారు. థామస్‌ ఇక లేడన్న వార్తని తను జీర్ణించుకోలేకపోతున్నానని థామస్‌ మంచి స్నేహితుడిని కోల్పోవడం విచారకరంగా ఉంది అని ఆయన బాధపడుతూ అందరి మనస్సులను కరిగించేసారు. తన స్నేహితుడిని కోల్పోయిన ఆవేదనను ట్విట్టర్‌ ద్వారా తెలియజేసారు.

English summary

Justin shared a touching note in twitter about his friend Thomas