జగన్ గురించి జ్యోతుల పురాణం

Jyothula Nehru Fires On YS Jagan

12:29 PM ON 1st June, 2016 By Mirchi Vilas

Jyothula Nehru Fires On YS Jagan

ఇంటిగుట్టు లంకకు చేటు అన్నారు కదా...అందుకే ఇంటి గుట్టు తెలిసినోళ్లతో జాగ్రత్తగా ఉండకపోతే, మా చెడ్డ ఇబ్బంది వచ్చేస్తుంది. ఇక ఓ పార్టీలో అధినేతలకు సన్నిహితంగా మెలిగి. పార్టీని విడిచి పెట్టి, మరో పార్టీ లోకి వెళ్లినోళ్లు నోరు విప్పితే సదరు అధినేతలు ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవ్వక తప్పదు. ఇక ఇప్పటిదాకా జగన్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన జ్యోతుల నెహ్రూ కావొచ్చు.. భూమా నాగిరెడ్డి కావొచ్చు.. వారికి తెలియని విషయాలంటూ ఏమీ ఉండకపోవచ్చు. జగన్ ను అసాంతం చదివేసిన అలాంటి వాళ్ళు నోరు విప్పితే, ఓ పురాణమే అవుతుంది. అలాంటి వాళ్ళ వలన జగన్ కు ఎంత డ్యామేజ్ వస్తుందనేది, జ్యోతుల తాజా విమర్శలు రుజువు చేస్తున్నాయి. ఎందుకంటే మనం చెప్పేకన్నా అందులో వుండి వచ్చినవాళ్ళు చెబితేనే అందంగా ఉంటుందని టిడిపి కూడా ఇలాంటి వాళ్ళ చేత మాట్లాడిస్తుంది.

వైసిపిలో డిప్యూటి ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించిన జ్యోతుల పాయింట్ టు పాయింట్ ఎత్తి చూపిస్తూ, ఈ మధ్య విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జ్యోతుల మాటలు విన్నప్పుడు, జగన్ మరీ ఇలా వ్యవహరిస్తాడా? అన్న సందేహం కలుగుతుంది. అదే సమయంలో ఆయన సందేహాల్లో లాజిక్ ఉందన్న విషయం తేలిపోతుంది. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో తమ ఎక్స్ బాస్ జగన్ మీద జ్యోతుల నెహ్రూ ఓ లెవెల్లో రెచ్చిపోయారు. విషయం పూసగుచ్చినట్లు చెబుతుంటే , అదో పురాణంలా ఉంది.

తాము అమ్ముడుబోయినట్లుగా ఆరోపణలు చేస్తున్న జగన్.. తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్తే మాత్రం ఎందుకు నోరు మెదపటం లేదని జ్యోతుల ప్రశ్నించారు. మా పై చేసిన ఆరోపణలు ఏవీ ఆయన పై చేయలేదు. ఆయన్ను కోట్ల రూపాయిలకు జగనే కేసీఆర్ కు అమ్మేశారా? అందుకే కిక్కురమనటం లేదా? ఈ విషయం మీద మాకు సమాధానం కావాలి. మా నాయకుడివని ఇంతకాలం నిన్ను పొగిడాం. ఇప్పుడు తిట్టటానికి మనస్కరించటం లేదు. కానీ.. నా ప్రశ్న ఒక్కటే. రాజకీయాల్లో వచ్చినప్పుడు నీ కుటుంబ స్థితిగతులేంటి? మా కుటుంబ స్థితిగతులేంటి? ఇప్పుడు ఎవరి ఆస్తులు ఎంత? బహిరంగంగా మీడియా ముందు శ్వేతపత్రాలు ఇద్దాం. చర్చిద్దాం. చేతనైతే రా అంటూ జ్యోతుల ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో తన దగ్గరకు వచ్చిన నేతల్ని జగన్ ఒక ప్రశ్న అడిగేవారని.. పది కోట్లు ఉన్నాయా? అలా ఉంటే ఆ తర్వాత అంతా నీదే అంటూ మాటలు చెప్పేవారని..అంటే పార్టీ గెలిచిన తర్వాత అంతా నీ ఇష్టం.. తోచినంత దోచుకోవచ్చన్నదే జగన్ మాటలకు సారాంశం అంటూ జ్యోతుల ధ్వజమెత్తారు.

"కోట్ల విజయభాస్కర్ రెడ్డి.. ఎన్టీఆర్.. వైఎస్ ఇలా ఎందరో ముఖ్యమంత్రుల్ని చూసాం. వారు సీఎంలుగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలు సైతం వెళ్లి వారి దగ్గర పనులు చేయించుకునేవాళ్ళు. కానీ జగన్ మాత్రం ఇప్పటి ముఖ్యమంత్రి దగ్గరకు తన ఎమ్మెల్యేలు వెళ్లకూడదంటారు. పూతలపట్టు ఎమ్మెల్యే తల్లికి ఆపరేషన్ కు రూ.5లక్షలు అవసరమై ఇబ్బంది పడుతుంటే.. నేను సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించా. ఈ విషయంలో జగన్ నన్ను తప్పు పట్టారు. శాసనసభాపక్ష ఉప నేతను అయినప్పటికీ జగన్ పక్కన కూర్చోకూడదు. ఐదు సమావేశాలకు మూడు సమావేశాల్లో నన్ను కూర్చోనివ్వలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకే సీట్లో కూర్చుంటారు కాబట్టి తానూ ఒకేసీట్లో కూర్చోవాలని జగన్ భావిస్తుంటారు. జగన్ కు అంత అహంకారం అంటూ జగన్ నైజం బట్టబయలు చేసారు. మొత్తానికి ఇలాంటి వ్యాఖ్యలతో జగన్ కి డ్యామేజ్ అలా ఇలా ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: డైలాగ్ కింగ్ తో ఉద్యమ నేత మంత్రాంగం

ఇవి కూడా చదవండి:ఈ నగరాల్లో బట్టలు వేసుకోవడం నిషిద్దం

English summary

Ysrcp MLA who Jumped into TDP recently Jyothula Nehru was recently fired on Ysrcp President Y.Jagamohan Reddy in Hyderabad in a Press Meet.