మీకు , మీ పార్టీకి ఇంక సెలవు

Jyothula Nehru Quits From Ysr Congress Party

05:29 PM ON 29th March, 2016 By Mirchi Vilas

Jyothula Nehru Quits From Ysr Congress Party

ఊహిస్తున్నట్టు గానే వైస్సార్ సిపిలో మరో వికెట్ పడింది ... ఆ పార్టీ ఉపనేత , తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఎం ఎల్ ఎ జ్యోతుల నెహ్రూ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో వున్న అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన పార్టీ అధినేత జగన్ కి ఓ లేఖ రాసారు. నేడో రేపో జ్యోతుల నెహ్రూ టిడిపి గూటికి రానున్నారు. గతంలో టిడిపి నుంచి రెండుసార్లు ఎం ఎల్ ఎ గా వున్న ఈయన 2009 ఎన్నికల ముందు ప్రజారాజ్యంలోకి వెళ్ళారు. ఎం ఎల్ ఎ గా పోటీచేసి, ఓటమి చెందిన ఈయన ఆతర్వాత పరిణామాల్లో జగన్ వైపు వచ్చారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గంపేట నుంచి విజయం సాధించారు. అసెంబ్లీలో వైస్సార్ సిపి ఉప నేతగా వున్నారు. అయితే ఇటీవల భూమా నాగిరెడ్డి వైసార్ సిపి ని వదిలి తిదిపిలోకి చేరడంతో పి ఎ సి చైర్మన్ పదవికి ఖాళీ ఏర్పడింది. ఈ పదవి నెహ్రూ కి వస్తుందని ఆశించారు. అలాగే మరికొందరు దీనిపై కన్నేశారు. కానీ సీనియర్లను కాదని కర్నూల్ జిల్లాకు చెందిన రాజేంద్రనాద్ రెడ్డికి ఇచ్చేయడం తో ఆపార్టీలో దుమారం రేగింది. అసంతృప్తికి గురైన నెహ్రూ ఆపార్టీకి రాజీనామా చేస్తారన్న వార్తలు వచ్చాయి. ఇందుకనుగుణం గా మంగళవారం రాజీనామా చేసారు. ఇక సైకిలు ఎక్కడమే తరువాయి .. ఈయన తో పాటూ నెహ్రూ తోడల్లుడైన ప్రత్తిపాడు ఎం ఎల్ ఎ వరుపుల సుబ్బారావు కూడా అదే బాట పట్టబోతున్నారు.

ఇవి కూడా చూడండి

ప్రాక్టీస్ కి 5 రూ. మ్యాగీ తిని వెళ్లే వాడు.. ఇప్పుడు టీమిండియా లో

జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది(ఫోటోలు)

సంగీత్‌లో చిందేసిన మెగాస్టార్‌

బ్రహ్మోత్సవం లో సీన్ లీక్! నిజంగా అద్భుతం

English summary

Ysr Congress Party leader Jyothula Nehru quits from Ysr Congress Party.Jyothula Nehru sends his resigning letter to Y.S.Jagan Mohan Reddy.