అ.. ఆ నుండి కె. విశ్వనాధ్‌ ఔట్‌!

K. Viswanath is out from A.. Aa movie

02:15 PM ON 7th December, 2015 By Mirchi Vilas

K. Viswanath is out from A.. Aa movie

నితిన్‌, సమంత హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం అ...ఆ. ఈ చిత్రానికి కోలీవుడ్‌ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుథ్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో ప్రముఖ దర్శకుడు, నటుడు కె. విశ్వనాధ్‌ నటిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం కె. విశ్వనాధ్‌ అధిక పారితోషికం డిమాండ్‌ చెయ్యడంతో కె. విశ్వనాథ్ని తప్పించి సీనియర్‌ నటుడు గిరిబాబుని ఎంపిక చేసుకున్నారు. త్రివిక్రమ్‌ తెరకెక్కించిన S/o. సత్యమూర్తి అనుకున్నస్థాయి లో విజయం సాధించాక పోవడంతో అ..ఆ.. చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి రావాలని త్రిమిక్రమ్‌ భావిస్తున్నాడట.

ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్యతో చిత్రం ప్రారంభించాలన్న సన్నాహాల్లో త్రివిక్రమ్ ఉన్నారు.

English summary

K. Viswanath is out from A.. Aa movie. Because viswanath demanding huge remmuneration for his character in A...Aa movie.