'బాహుబలి- 2' లో మళ్లీ కాలకేయ!

Kaalakeya role in Baahubali-2

01:55 PM ON 31st December, 2015 By Mirchi Vilas

Kaalakeya role in Baahubali-2

ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో ప్రతీ పాత్ర హైలెట్టే. ఇందులో 'కాలకేయ' పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాత్రలో ప్రభాకర్‌ అద్భుతంగా నటించాడు అనడం కంటే, ఆ పాత్రని రాజమౌళి అంత బాగా తీర్చి దిద్దాడు అంటే బాగుంటుంది. మొదటి భాగంలో బాహుబలి కాలకేయుడ్ని హతమార్చగా ఆ పాత్ర అక్కడితో అయిపోయింది అనుకున్నారంతా. అయితే ఆ పాత్రని ముగించడం ఇష్టం లేక రాజమౌళి బాహుబలి-2 లో కూడా ఆ పాత్రని కొనసాగిస్తున్నాడు. లోఫర్‌ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించిన చరణ్‌ దీప్‌ బాహుబలి-2 లో కాలకేయుడికి తమ్ముడిగా నటించబోతున్నాడు. ఇందులో చరణ్‌ది ఫుల్ లెంగ్త్‌ రోల్‌ అట. మార్చి నెల నుండి చరణ్‌ బహుబలి-2 షూటింగ్‌ లో పాల్గొంటాడని సమాచారం.

English summary

Kaalakeya role in Baahubali- 2 movie. Loafer movie villan Charan Deep is playing as a Kalyakeya in Baahubali -2.