కాపులకి సరైన గుర్తింపు దక్కలేదు: పవన్ కళ్యాణ్

Kaapu caste didn't get correct recognise

06:53 PM ON 1st February, 2016 By Mirchi Vilas

Kaapu caste didn't get correct recognise

'కాపు మహాగర్జన' పేరు మీద నిన్న తునిలో సృష్టించిన మారణ హోమం అందరికీ తెలిసిందే. ఈ ఘటన తెలుసుకున్న పవన్ కల్యాణ్ వెంటనే కేరళ లో షూటింగ్ క్యాన్సల్ చేసుకుని వెంటనే హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో పవన్ స్పందిస్తూ ఈ ఘటన నాకెంతో బాధకలిగించిందని జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. మీడియాతో మాట్లాడిన పవన్ శాంతియుతంగా జరగాల్సిన ఈ కాపు మహాగర్జన ఎందుకిలా మారణ హోమం గా మారిందో నాకు అర్ధం కాలేదని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది, సమస్యల పై ఉద్యమించడంలో తప్పు లేదు కానీ శాంతియుతంగా జరగాల్సిన ఈ సభను ఇలా కావాలనే చేశారు.

కాపుల రిజర్వేషన్ అనేది ఈ రోజు తెచ్చింది కాదు, బ్రిటీష్ కాలం నుంచి కాపులను బీసీలనే పరిగణించారు, కాపులంటే అనేక తెగల సముదాయం. ఉత్తరాంధ్రలో వెనుకబడిన కులాలుగా కాపులు గుర్తింపు పొందారు. అంతే కాదు రాయలసీమ, తెలంగాణలో కూడా కాపులకు వెనుకబడిన కులంగా గుర్తింపు ఉంది. కోస్తాలో మాత్రం ఆ గుర్తింపు దక్కలేదు అని పవన్ చెప్పారు.

English summary

Power Star Pawan Kalyan reacts about Kapu caste incident. He talks that Kaapu caste didn't get correct recognisation.