మలేషియాలో 'కబాలి' ఆడియో!!

Kabali audio launch in Malaysia

12:45 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

Kabali audio launch in Malaysia

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కబాలి'. రంజిత్‌ కుమార్‌ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌ సరసన రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంలో రజనీకాంత్‌ ఒక అండర్‌ వరల్డ్‌ డాన్‌గా కనిపించనున్నారు. కబాలి చిత్రం మేజర్‌ ఘాటింగ్‌ మలేషియాలో జరిగిందన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఘాటింగ్‌ సమయంలోనే రజనీకాంత్‌ కి మలేషియాలో కూడా అంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందని తెలిసింది. ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలోని పాటలు విభిన్నంగా మలేషియాలో విడుదల చెయ్యాలని సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం ఘాటింగ్‌ గోవాలో జరుగుతుంది. వేసవి కానుకగా కబాలి ప్రేక్షకుల ముందుకు రానుంది. కబాలి ఘాటింగ్‌ అయిపోయిన వెంటనే రజనీకాంత్‌ 'రోబో 2.0' ఘాటింగ్‌ లో జాయిన్‌ అవుతారు.

English summary

Super Star Rjani Kanth's Kabali audio want to launch in Malaysia. Radhika Apte is pairing with rajnikanth in this movie.