బాహుబలి ముందు చతికిలబడ్డ కబాలి

Kabali Collections Slow Down

10:49 AM ON 2nd August, 2016 By Mirchi Vilas

Kabali Collections Slow Down

విడుదలకు ముందునుంచీ ఆహా ఓహో అనే టాక్ నడిచిన కబాలి చివరకు బోల్తా కొట్టింది. దీంతో దర్శక ధీరుడు రాజమౌళి, హీరో ప్రభాస్ ల బాహుబలి ముందు రజనీ..కబాలి నిలవలేక, చతికిలబడింది. రజనీ సినిమా ఇండియాలో 149 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. గ్రాస్ కలెక్షన్ రూ. 172 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 90 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటివారంలో థియేటర్లలో దూకుడుగా ఆడినా రెండో వారం నుంచి కాస్త మందగించింది. మొత్తానికి బాహుబలి రికార్డును కబాలి కొట్టివేయడంలో వెనుకబడింది.

మొత్తానికి ఫస్ట్ వీక్ లో 262 కోట్లు సాధించింది అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఏమైనా బాహుబలి రికార్డును కబాలి బద్దలు కొడుతుందని అనుకున్నా, కనీసం టచ్ చేయలేకపోయిందని విశ్లేషిస్తున్నారు. ఈ మూవీ రూ. 500 కోట్ల వసూళ్లతో కొల్లగొట్టిందని చెబుతున్నారు. మొత్తానికి బాహుబలి తరువాతే కబాలి నిలిచిందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:తిమింగలంతో కలిసి హీరోయిన్ స్విమ్మింగ్

ఇవి కూడా చదవండి:ఈ లిప్ లాక్ సీన్స్ కి కత్తెర పడలేదట

English summary

South Super Star Rajinikanth's Kabali movie was created hype from the begining and all the people taught that this movie was going to break Bahubali Records but this movie collection slow down from the second week.