డామిట్ కధ అడ్డం తిరిగింది.. కబాలి ఎండింగ్ మార్చేశారు!

Kabali ending was changed in Malaysia

01:34 PM ON 25th July, 2016 By Mirchi Vilas

Kabali ending was changed in Malaysia

ఒకే సినిమాకు రెండు రకాల ముగింపు ఇస్తే, ఎలా ఉంటుంది? సరిగ్గా అదే జరిగింది సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి' విషయంలో... దీంతో అక్కడ ఒకలాగా, ఇక్కడ ఒకలాగా అన్నట్టు వ్యవహారం తయారయింది. ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలిపై విడుదలకు ముందు నుంచీ భారీ అంచనాలు ఏర్పడి, చివరకు ఆకాశాన్నంటాయి. తీరా సినిమా విడుదలయ్యాక తుస్సుమంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ కొత్త విషయం తెరపైకి వచ్చింది. పతాక సన్నివేశాల్లో కబాలి నడుపుతున్న ఫ్రీ లైఫ్ స్కూల్ లోని ఓ విద్యార్థి వచ్చి కాల్పులు జరుపుతాడు. ఆ శబ్ధంతో తెరపై దర్శకుడి పేరు కనపడుతుంది. తప్ప కంక్లూజన్ లేదు. నెగిటీవ్ ఎండింగ్ అని పెదవి విరుస్తున్న వారూ లేకపోలేదు. అయితే ఇది తమిళ ప్రేక్షకులకి కొత్తేం కాదు. అయినా ఈ సినిమాలో రజనీ చనిపోయారా.. లేదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అయింది.

అంతేకాదు, కబాలికి సీక్వెల్ ఉంటుందా అన్న చర్చ మొదలైంది. అయితే, మనకు ఇంత రచ్చ మిగిల్చిన ఈ సినిమా మలేషియన్ ప్రేక్షకులకు మాత్రం ఈ గొడవ లేకుండా చేసిందట. దీనికి కారణం, అక్కడ క్లైమాక్స్ మరోలా ఉండటమేనని చెబుతున్నారు. ప్రతినాయకులను తుదిముట్టించిన కబాలి చివర్లో మలేషియన్ పోలీసులకు లొంగిపోయినట్లు ఎండ్ టైటిల్స్ లో వేశారు. మలేషియా నేపథ్యంలో సాగే ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ అక్కడే జరిగింది. దాంతో సినిమాలోని సన్నివేశాలు అక్కడి పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా ఉండకూడదని దర్శకుడు ఈ రకంగా మలిచాడట. అయితే మనకి మాత్రం తిప్పలు తప్పలేదు. మొదట్లో కలెక్షన్స్ బాగున్నా ఇప్పుడు తేడా వచ్చింది. అసలు ఏ సినిమా ఎలాంటి గుణపాఠం నేర్పుతుందో చూడాలి.

English summary

Kabali ending was changed in Malaysia