కబాలి మూడు రోజుల కలక్షన్స్ ఎంతో తెలుసా.!

Kabali First Three Days Collections

10:57 AM ON 25th July, 2016 By Mirchi Vilas

Kabali First Three Days Collections

కబాలి.. కబాలి.. కబాలి.. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం భారీ ఎత్తున ఈ ఫిల్మ్ రిలీజైంది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా, ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం దుమ్మురేపాయి. ఒకవిధంగా చెప్పాలంటే ఇండియాలో ఇప్పటివరకు నమోదైన రికార్డులన్నీ కబాలి సునామీలో తుడిచి పెట్టుకుపోయాయని అంటున్నారు. ఫస్ట్ రోజు కలెక్షన్స్ లో ఎవరికీ అందనంత ఎత్తుకి కబాలి వెళ్లిపోయింది. అలాగే కబాలి సినిమా మొదటి మూడు రోజుల్లో ఏకంగా రూ.184.89 కోట్లు వసూలు చేసినట్టు టాక్ నడుస్తోంది.

ఫస్ట్ డేతోపాటు, వీకెండ్ కూడా అడ్వాన్స్ బుకింగ్ 60 పర్సెంట్ ఐపోవడంతో బయ్యర్స్ ఫుల్ జోష్ లో వున్నారు. ఇక తమిళనాడు విషయానికొస్తే.. ఇప్పటివరకు విజయ్, అజిత్ నెలకొల్పిన తొలిరోజు రికార్డులూ కనుమరుగైపోయాయి. 21.50 కోట్లు రాబట్టి కోలీవుడ్ లో సరికొత్త రికార్డును కబాలి నమోదు చేసింది. ఇక తెలుగు రాష్ర్టాల్లో 9.50 కోట్లు వసూలు చేసింది. కోలీవుడ్ మూవీ తొలిరోజు తెలుగులో ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం ఇదే ఫస్ట్ టైమ్ అంటున్నారు. ఇక కేరళ - 3.45 కోట్లు, కన్నడ - 5.10 కోట్లు, నార్త్ ఇండియాలో తెలుగు, తమిళం, హిందీ లాంగ్వేజ్ ల్లో 5.20 కోట్లు కలెక్ట్ చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్ష్ తెలిపాడు. దటీజ్ రజనీ అంటూ రజనీ అభిమానులు మురిసిపుతున్నారు.

ఇవి కూడా చదవండి:చలాకీ చంటి చెంప ఛెళ్లు మనిపించిన రేష్మి (వీడియో)

ఇవి కూడా చదవండి:సూపర్ స్టార్ కి మదర్ దొరికేసింది...

English summary

Super Star Rajinikanth's Latest film Kabali released world wide grandly and the records were broken. Kabali movie was released with high expectations and here are the first three days collections of Kabali movie.