'బాహుబలి'ని బెంబేలెత్తించిన 'కబాలి'

Kabali in second place in overseas collections

03:09 PM ON 26th July, 2016 By Mirchi Vilas

Kabali in second place in overseas collections

ఏమిటి హిట్ సినిమాకు, ప్లాప్ సినిమాకు పోలికా అని అనుకోకండి. ఇది నిజం. ఎందుకంటే, కబాలి సృష్టించిన సునామీ మామూలుగా లేదు. ఓసారి వివరాల్లోకి వెళ్తే.. దాదాపు ఏడాది క్రితం విడుదలైన బాహుబలి సినిమా అప్పటివరకు ఉన్న ఎన్నో రికార్డులను తుడిచిపెట్టేసింది. దాదాపు 150 కోట్లు ఖర్చుపెట్టి, మూడేళ్లపాటు తీవ్రంగా శ్రమించి రాజమౌళి బృందం దాన్ని తెరకెక్కించింది. అలాంటి సినిమాలు తీయడం కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇక విడుదలైన దగ్గర్నుంచి ప్రశంసలతో, పాజిటీవ్ రివ్యూలతో ఆ సినిమా ఇంటా, బయటా దుమ్ము రేపింది. ఏ దక్షిణభారత సినిమా సాధించనంతగా అమెరికాలో 6 మిలియన్ డాలర్లు(దాదాపు 40 కోట్ల రూపాయలు) కొల్లగొట్టి అగ్రస్థానంలో నిలిచింది. ఇలాంటి లైఫ్ టైమ్ ఎపిక్ కు సూపర్స్టార్ రజనీ కబాలి షాకిచ్చింది.

బాహుబలిలా సంవత్సరాల తరబడి షూటింగ్ జరగలేదు. కేవలం ఎనిమిది నెలల్లో కబాలి మూవీని చుట్టేశారు. బడ్జెట్ కూడా బాహుబలితో పోలిస్తే కబాలికి తక్కువే. ఇక ముఖ్యంగా చెప్పాల్సి వస్తే, విడుదలైన దగ్గర్నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడమే కాదు, నెగిటీవ్ రివ్యూలు, విమర్శలతో కబాలి జర్నీ స్టార్ట్ చేశారు. ఇన్ని లోపాలున్నా సరే, అమెరికాలో ఒక్క వారంలోనే 4 మిలియన్ డాలర్లు(దాదాపు 26 కోట్ల రూపాయలు) సాధించి ట్రేడ్ నిపుణులను సైతం కబాలి షాక్ కు గురిచేసింది. ఇప్పుడే ఇలా వుంది, ఇక సినిమాకు కనీసం యావరేజ్ టాక్ వచ్చినా సులభంగా బాహుబలిని దాటగలిగి ఉండేదని విశ్లేషకులు అంటున్నారు.. ఈ ఫ్లాప్ టాక్ తోనే యూఎస్ లో బాహుబలి తర్వాత అత్యంత కలెక్షన్లు సాధించిన రెండో దక్షిణ భారత సినిమాగా కబాలి నిలిచింది. ఇందుకు ప్రధాన కారణం దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్ అని ప్రతి ఒక్కరూ చెప్పేమాట. అదే ఏనుగు చచ్చినా వెయ్యి, బతికినా వెయ్యే అనే సామెత ఇక్కడ కరెక్టుగా సరిపోతుంది. దటీజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటూ అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు.

English summary

Kabali in second place in overseas collections