'కబాలి' ఇంట్రడక్షన్ సీన్ లీక్ అయిందా(వీడియో)

Kabali introduction scene leaked

12:20 PM ON 21st July, 2016 By Mirchi Vilas

Kabali introduction scene leaked

కోట్లాది మంది అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్న, సూపర్ స్టార్ రజనీకాంత్ న్యూ మూవీ కబాలి ఇక రిలీజ్ కావడానికి కొద్ది గంటలే సమయం మిగిలింది. అయితే తాజాగా... రజనీ జైలు నుంచి విడుదల అవుతున్న దృశ్యాలతో కూడిన రెండున్నర నిముషాల ఇంట్రడక్షన్ సీన్స్ లీక్ అయినట్టు చెబుతున్నారు. దీన్ని డౌన్ లోడ్ చేసుకుని నెట్ లో లీక్ చేసినట్టు తెలిసింది. ఈ మూవీ పైరసీని అడ్డుకోవాలని నిర్మాత థాను మద్రాస్ హైకోర్టుకెక్కినప్పటికీ పైరసీకారులు ఏదో విధంగా చెలరేగిపోతున్నారు. లీక్ అయిన సీన్స్ లో అరబిక్ సబ్ టైటిల్స్ ఉండడంతో ఈ సీన్స్ గల్ఫ్ దేశాల్లో లీక్ అయిందన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఇక యూఎస్ లో ముందే షో పడింది. ఏదైతేనేం సినిమా తాలూకు తొలి సీన్ విడుదలయిందన్న వార్తలతో రజనీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

English summary

Kabali introduction scene leaked