'కబాలి' ఫ్లాష్‌ బ్యాక్‌ స్టోరీ లీకైంది

Kabali movie flash back photo leaked

03:55 PM ON 13th February, 2016 By Mirchi Vilas

Kabali movie flash back photo leaked

సౌత్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కబాలి'. పిఏ రంజిత్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌ సరసన రాధికా ఆప్టే, థన్సిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్‌ ప్రస్తుతం మలేషియాలో జరుపుకుంటుంది. ఇక్కడ ఫ్లాష్‌బ్యాక్‌ సంబంధించిన సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారట. దీనికి సంబంధించిన ఒక ఫోటో ఇంటర్నెట్‌లో లీకైంది. రజనీకాంత్‌ ఫ్లాష్‌బ్యాక్‌ లో ఒక కుర్రాడిలా కనిపించబోతున్నాడని ఈ ఫోటో చూస్తే అర్ధమవుతుంది. అంతే కాదు ఫ్లాష్‌బ్యాక్‌ లో ఒక సంఘటన కారణంగా రజనీ గ్యాంగ్‌ స్టర్‌గా మారతాడట.

అచ్చం 'బాషా' సినిమాలోలాగే మాట. అప్పట్లో బాషా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఇప్పుడు 'కబాలి' కూడా అలానే అలరిస్తుందో లేదో చూడాలి. లీకైన ఫోటో మీరు కూడా చూడండి.

English summary

Super Star Rajinikanth latest movie Kabali movie flash back photo leaked. This movie is directing by PA Ranjtih Kumar. Radhika Apte and Dhaniska is romancing with Rajini in this movie.