కబాలి స్టోరీ కావాలనే లీక్ చేసారట!

Kabali movie story leaked

07:07 PM ON 27th June, 2016 By Mirchi Vilas

Kabali movie story leaked

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కబాలి. పిఏ రంజిత్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన రాధికా ఆప్టే, థన్సిక హీరోయిన్లుగా నటించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో నిన్నే విడుదలైంది. అయితే ఈ సందర్భంగా దర్శుడు పా రంజిత్ కబాలీ స్టోరీని రివీల్ చేసేశారు. ఈ సినిమాకు ముందు తాను డైరెక్ట్ చేసిన అట్టకత్తి, మద్రాస్ సినిమాలు రజనీకాంత్ గారు చూసి తానే స్వయంగా ఫోన్ చేశారని.. నేను ఆయన వద్దకు వెళ్లగానే నీతో సినిమా చేయాలనుకుంటున్నానని.. మంచి కథ ఉంటే చెప్పమని రజనీకాంత్ గారు అడిగినట్టు రంజిత్ తెలిపారు.

దీంతో తన దగ్గర ఉన్న కబాలి స్టోరీ ఆయనకు వినిపించగా ఆయన వెంటనే ఓకే చేసినట్టు రంజిత్ తెలిపారు. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. బ్రిటిష్ కాలంలో మలేషియాకు వలసపోయిన కార్మికుల్లో ఓ కుటుంబంలో పుట్టిన వ్యక్తే కబాలీశ్వరుడు. కార్మికుల కష్టాల్ని తీర్చడానికి అతనెలా మారాడు అన్నది ఈ చిత్ర కాదాంశం. మలేషియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఓ మాఫియా డాన్ కథ ఇది. ఇందులో రజనీకాంత్ రెండు డిఫరెంట్ షేడ్స్లో కనిపిప్తారు. ఒకటి యువకుడిగా, మరోకటి ముల్లు మలార్ సినిమా సమయంలో రజనీ స్టైల్ ఎలా ఉండేదో అలా ఉంటుందట.

ఈ స్టైల్లో రజనీ 20 నిమిషాలు మాత్రమే అలా కనిపిస్తారు. ఇది యాక్షన్ సినిమా మాత్రమే కాదు. చక్కని భావోద్వేగాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. రజనీకాంత్ మాట్లాడే ప్రతి మాట పంచ్ లాగా ఉంటుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమా పై భారీ అంచనాలు నెలకొల్పగా, ఇప్పుడు కథ కూడా చెప్పడంతో సినిమా పై మరింత అంచనాలు పెరిగిపోయాయి.

English summary

Kabali movie story leaked