పైరసీ కోరల్లో 'కబాలి' తమిళ వెర్షన్

Kabali movie tamil version piracy leaked

11:56 AM ON 23rd July, 2016 By Mirchi Vilas

Kabali movie tamil version piracy leaked

పైరసీ భూతం కబాలిని కబళిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భారీ మూవీ కబాలి రిలీజ్ కు ముందే కొన్ని సన్నివేశాలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టాయి. లేటెస్ట్ గా శుక్రవారం మధ్యాహ్నానికే పూర్తి తమిళ వెర్షన్ ఇంటర్నెట్ లో తిరగడం మొదలెట్టింది. వాస్తవానికి పైరసీని అరికట్టాలంటూ ప్రొడ్యూసర్ థాను మద్రాసు హైకోర్టుకు వెళ్లినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. ప్రింట్ తో పాటు ఆడియో కూడా క్లియర్ గా వుండడంతో నెటిజన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అంతకుముందు 169 వెబ్ సైట్లపై మద్రాసు హైకోర్టు ఆంక్షలు విధించింది కూడా. ఈ ఫిల్మ్ కి సంబంధించి గల్ఫ్ లో రజనీ ఇంట్రడక్షన్ సీన్స్ గురువారం నాడే నెట్ లో హల్ చల్ చేశాయి.

English summary

Kabali movie tamil version piracy leaked