'కబాలి' టీజర్‌ రిలీజ్‌ డేట్‌

Kabali movie teaser release date out

12:36 PM ON 12th February, 2016 By Mirchi Vilas

Kabali movie teaser release date out

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కబాలి'. పి. రంజిత్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌ సరసన రాధికా ఆప్టే, థన్సిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. రజనీకాంత్‌ ఇందులో మాఫియా డాన్‌ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి చివరి షెడ్యూల్‌ మలేషియాలో జరుగుతుంది. అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్‌ రైట్స్‌ని అమెరికాలో అత్యధిక ధరతో కొనుకున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారాన్ని ఈ చిత్ర నిర్మాత కలైపులి ఎస్‌.థాను ఒక విషయాన్ని ప్రకటించారు. అదేంటంటే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'కబాలి' టీజర్‌ రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేశారు.

మార్చి నెలలో ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేయబోతున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.

English summary

Super Star Rajinikanth latest movie Kabali teaser is releasing on march month. This movie is directing by P. Ranjith Kumar. Radhika apte and Dhansika is romancing with Rajinikanth in this movie.