‘బ్రహ్మోత్సవం’ టీజర్‌కి ‘కబాలి’ షాక్?

Kabali Shock To Brahmotsavam Teaser

10:11 AM ON 3rd May, 2016 By Mirchi Vilas

Kabali Shock To Brahmotsavam Teaser

అవునా, అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ నటించిన తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’ టీజర్‌కి సినీ అభిమానుల నుంచి స్పందన బానే వస్తోంది. విడుదలైన 24 గంటల వ్యవధిలో ఐదున్నర లక్షలకు‌పైగా హిట్స్ వచ్చాయి. దీంతో ఇటు ప్రిన్స్ అభిమానులు..అటు యూనిట్ కూడా హ్యాపీ గా వున్నారు. పోస్టర్ నుంచే స్పందన బాగుండడంతో ప్రొడ్యూసర్ లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టాడు. ఏ డేట్ బ్రహ్మోత్సవానికి కలిసొస్తుంది? న్యూమరాలజీ ప్రకారం ఎన్ని థియేటర్స్‌లో రిలీజైతే బాగుంటుంది? ఇలా రకరకాల లెక్కల్లో మునిగి తేలినట్లు ఫిలిం వర్గాల్లో వినికిడి.

ఇవి కూడా చదవండి:పవన్ సేనాపతి ఫస్ట్ లుక్ సందడి!

కాకపొతే కొంత నిరుత్సాహం కూడా వున్నట్లు చెబుతున్నారు.నిజానికి బ్రహ్మోత్సవానికి 10 నుంచి 15 లక్షల హిట్స్ రావాల్సిందని, కాకపోతే ఎట్ ద సేమ్ టైమ్ రజనీకాంత్ ‘కబాలి’ టీజర్ రావడంతో అనుకోకుండా బ్రహ్మోత్సవం హిట్స్ తగ్గాయని అంటున్నారు. కబాలి రూపంలో బ్రహ్మోత్సవానికి పెద్ద షాక్ తగిలిందనే సెటైర్లు సోషల్ మీడియాలో చోటుచేసుకుంటున్నాయి. ఇక ‘బ్రహ్మోత్సవం’ మూవీ ఆది నుంచి వివాదాస్పదంగా మారుతున్నట్లు చెప్పుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:చనిపోయిన ప్రతీ మనిషి ఆత్మ ముందు ఆ గుడికే వెళ్తుందట!

ఇవి కూడా చదవండి:అదే గెటప్ లో ... సేనాపతి..!

English summary

Recently Tollywood Super Star Mahesh Babu movie "Brahmotsavam" and South Super Star Rajinikanth's "Kabali" movies teasers were released and they were going viral over Social Networking Sites.