విడుదలకు ముందే రికార్డు బ్రేక్ చేసిన కబాలి

Kabali Teaser As Highest Viewed Indian Film Teaser

04:11 PM ON 13th May, 2016 By Mirchi Vilas

Kabali Teaser As Highest Viewed Indian Film Teaser

ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కబాలి. 65 ఏళ్ల లేటు వయసులో రజినీకాంత్ డాన్‌ పాత్రలో నటించిన కబాలి సినిమా టీజర్ అభిమానులకు పండుగ చేస్తోంది . ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ , టీజర్ లతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కబాలి ఫస్ట్ లుక్ తోనే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది . ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే విడుదలకు ముందే రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతోంది కబాలి . కబలి టీజర్ 22 గంటల్లోనే 50 లక్షలకు పైగా హిట్లు సంపాదించి సరికొత్త రికార్డు సృష్టించగా, తాజాగా మరో రికార్డు ను బద్దలుకొట్టింది. కబాలి టీజర్ను ఇప్పటి వరకు కోటి 71 లక్షల మందికి పైగా వీక్షించారు.దీంతో అత్యధిక హిట్లు వచ్చిన ఇండియన్ ఫిల్మ్ టీజర్గా కబాలి టీజర్ రికార్డు సృష్టించింది . రజినీకాంత్ దెబ్బకు బాలీవుడ్ సూపర్ స్టార్స్ అమీర్ ఖాన్ ధూమ్-3, సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమాల టీజర్ల

రికార్డులు బ్రేక్ అయ్యాయి. మే 1న విడుదలైన కబాలి టీజర్ సంచనాలు సృష్టిస్తోంది. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీ భార్యగా రాధికా ఆప్టే నటిస్తుండగా.. ఇతర పాత్రలలో కలైరసన్, దినేష్, రిత్విక తదితరులు నటించారు.

ఇవి కూడా చదవండి:అందరి ముందు హీరోయిన్ బట్టలు విప్పించిన డైరెక్టర్

ఇవి కూడా చదవండి:అఖిల్ తో సినిమా తీయలేను అంటూ తప్పుకున్న డైరెక్టర్

English summary

Indian Super Star Rajini Kanth's latest Film Kabali movie was creating new records in Indian Film History. Kabali Movie Teaser sets the record as the Most Viewed Teaser in Indian Film History. Radhika Apte was acted as Heroine along with Rajinikanth and Rajinikanth was acting in a Don Role in The Movie.