అమెరికాలో 400 థియేటర్లలో కబాలి

Kabali To Release in 400 Theaters In America

11:23 AM ON 14th July, 2016 By Mirchi Vilas

Kabali To Release in 400 Theaters In America

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 'కబాలి' అమెరికాలో సంచలనంగా మారిందని అంటున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సినీ గెలాక్సీ కబాలి సినిమా అమెరికాలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. పిఎ రంజిత్ తెరకెలెక్కించిన ఈ చిత్రంలో రజనీ జోడీగా రాధికా ఆప్టే నటిస్తోంది. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా రజనీ సినిమా అమెరికాలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. 400 థియేటర్లలో ఈనెల 22న విడుదల కాబోతున్న ఈ సినిమాకి ముందు రోజు ప్రీమియర్ షోలను కూడా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారు.

కబాలి టికెట్ల బుకింగ్ అమెరికాలో ఇప్పటికే మొదలైందని, మొదటి రెండు గంటల్లోనే టికెట్లు అమ్ముడుపోయాయని సిని గెలాక్సీ అధినేత మధు గార్లపాటి ప్రకటించారు. ప్రీమియర్ షో టికెట్ ధర ను 25 డాలర్లుగా నిర్ణయించినట్టు చెప్పారు. గతంలో థేరీ, 24 చిత్రాలను కూడా సినీ గెలాక్సీ సంస్థే అమెరికాలో రిలీజ్ చేసింది. తెలుగు.. తమిళం రెండు భాష ల్లోనూ కబాలి మూవీని అమెరికాలో రిలీజ్ చేస్తుండటం విశేషం.

ఇవి కూడా చదవండి: శ్రావణంలో మెగా అల్లుడి ఎంట్రీ

ఇవి కూడా చదవండి: చిరు సరసన విజయ శాంతి

English summary

South Super Star Rajinikanth's upcoming flick "Kabali" was creating hype day by day and this movie was going to release in a grand way and this movie was going to be release in 400 theaters in America by cinema distribution company named Cine Galaxy.