కబాలి రిలీజ్ డేట్ ఖరారు

Kabali To Release On July First Week

12:29 PM ON 14th May, 2016 By Mirchi Vilas

Kabali To Release On July First Week

ఈ సమ్మర్ ముగిసాక సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రేక్షకుల దగ్గరికి రాబోతున్నాడు. అదేనండీ రజనీ నటించిన తాజా గ్యాంగ్ స్టర్ మూవీ కబాలి విడుదల తేదీని మొత్తానికి ఖరారు చేశారు. ఈ సినిమా జూలై 1 లేదా 7న విడుదల అవుతుంది. సల్మాన్ ఖాన్ సినిమా సుల్తాన్ తో క్లాష్ లేకుండా వీటిలో ఏదో ఒక తేదీ నిర్ణయిస్తారు. రంజిత్ పా దర్శకత్వంలో కలైపులి ఎస్ థాను ఈ సినిమాని నిర్మించారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్రం టీజర్ 1.6 కోట్ల మంది చూశారు. 24 గంటల్లోనే 20 మిలియన్ల మంది చూసిన ఈ టీజర్ రికార్డులు బద్దలుకొట్టింది. అపూర్వమైన రజిని స్టైల్ ని టీజర్ ప్రతిబింబించింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు, డబ్బింగ్ కార్యక్రమాల్లో రంజిత్ టీం బిజీగా ఉంది. ఇందులో నటించిన తైవాన్ నటుడు విన్ స్టన్ చావో కూడా డబ్బింగ్ కి హాజరవుతున్నాడు. కబాలి విడుదలతో ఎన్ని రికార్డులు తిరగ రాస్తుందో మరి .

ఇవి కూడా చదవండి: సొంత చెల్లి పై అత్యాచారం చేసి గర్భవతిని చేసాడు

ఇవి కూడా చదవండి: ఇంట్లో భార్యలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా?(వీడియో)

ఇవి కూడా చదవండి: రేపిస్ట్ నాలుక కొరికి తప్పించుకున్నయువతి

English summary

Super Star Rajinikanth's Kabali Movie was creating history by its teaser and now the release date of Kabali was confirmed by the movie unit. Kabali movie was going to release on July First week.