ఆ 'విలన్‌' ఇప్పుడు టాలీవుడ్‌కి మోస్ట్ వాంటెడ్!

Kabeer Duhan Singh is now most wanted villan in tollywood

06:35 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

Kabeer Duhan Singh is now most wanted villan in tollywood

గోపిచంద్‌ కథానాయకుడిగా నటించిన 'జిల్‌' చిత్రంలో హీరోతో పాటు విలన్‌ కూడా చాలా స్టైలిష్‌గా ఉంటాడు. ఆ విలన్‌ పేరు 'కబీర్‌ దుహాన్‌ సింగ్‌'. 'జిల్‌'తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ విలన్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్‌వాంటెడ్‌ విలన్‌గా మారిపోయాడు. ఏకంగా ఇప్పడు 11 సినిమాల్లో విలన్‌గా నటిస్తూ బిజీగా ఉన్నాడు. పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న సర్దార్‌ గబ్బర్‌సింగ్‌లో కూడా విలన్‌గా నటిస్తున్నాడు. నేను ఇక్కడ వాడిని కాకపోయినా టాలీవుడ్‌ నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నానని కబీర్‌ చెప్తున్నాడు. ఇతను విలన్‌గా నటించిన చివరి చిత్రం 'వేదాలం'.

అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రం తమిళంలో సూపర్‌ హిట్‌ అయింది. ఈ చిత్రంతో కోలీవుడ్‌ లోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు కబీర్‌. అయితే కబీర్‌ ముందు ఒక మోడల్‌ తన కర్లీహెయిర్‌ - జీన్స్‌ ప్యాంట్‌ తో కనిపించే డ్రెసింగ్‌ను మోడలింగ్‌తో పాటూనే సనిమాలో కనిపిస్తున్నాను అదే ఇప్పడు నన్ను మోస్ట్‌ వాంటెడ్‌ స్టైలిష్‌ విలన్‌గా మార్చేసింది అని అంటున్నాడు.

English summary

Kabeer Duhan Singh is now most wanted villan in tollywood. He acted in Jil movie in telugu. It is his first movie in telugu.