ఆ స్మగ్లర్ ఆస్తులు ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది(వీడియో)

Kadapa smuggler Gangi reddy properties details

12:34 PM ON 1st July, 2016 By Mirchi Vilas

Kadapa smuggler Gangi reddy properties details

కడప వీరప్పన్... ఎర్రగంగులు... ఈ పేర్లు ఎవరివంటే, కొల్లం గంగిరెడ్డి! అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గా మారిన గంగిరెడ్డి ఆస్తుల విలువ లెక్కించడం అంత సులభం కాదట. కడప జిల్లా పుల్లంపేట మండలం మల్లెంవారిపల్లెలో సాధారణ రైతు కుటుంబానికి చెందిన గంగిరెడ్డి ఇరవైఏళ్ల క్రితం శేషాచలం అడవులను అడ్డాగా మార్చుకున్నాడు. ఎర్రచందనం అక్రమ వ్యాపారానికి తెరతీశాడు. అడవులను కొల్లగొట్టి కోట్లకు పడగలెత్తిన గంగిరెడ్డి దేశవిదేశాల్లో ఆస్తులు కూడబెట్టుకున్నాడు. అయితే చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక గంగిరెడ్డికి చుక్కెదురైంది.

ప్రస్తుతం మనవాడు కడప సెంట్రల్ జైల్లో ఊచలు లెక్కిస్తున్న ఇతడి వ్యవహారం ఒకప్పుడు ఆడిందే ఆట.. చేసిందే స్మగ్లింగ్ అన్నట్టుగా సాగింది. ఎర్రచందనం చెట్లని ఎడాపెడా నరికి కాసులుగా మార్చేసుకున్నాడు. ఇంతకీ ఇతగాడి అక్రమాస్తుల లెక్క చెబితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందట. ఏపీ ప్రభుత్వం ఇటీవల అతని ఆస్తులపై ఆరాతీసింది. వాటిని స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. గంగిరెడ్డి పేరిట, ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, బినామీల పేరిట ఉన్న అక్రమాస్తులను లెక్కకడితే రెండు వేల కోట్ల పైచిలుకే ఉంటాయట. అతని సొంత మండలమైన పుల్లంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లో విలువైన స్థలాలు, హైవేలలో పెట్రోల్ బంకులు, మంగంపేటలో పల్వరైజింగ్ మిల్లులు ఉన్నట్లు సమాచారం.

ఇవి కాకుండా తిరుపతి, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ లలో భారీగా అక్రమాస్తులను కూడబెట్టుకున్నాడట. వీటితోపాటు విదేశాల్లో భారీ మొత్తంలో నగదు దాచినట్లు తెలిసింది. ఈ నగదు విలువ వెయ్యి కోట్లపైనే ఉంటుందని ఆయన వర్గీయులే అంటున్నారట.

English summary

Kadapa smuggler Gangi reddy properties details