ఎట్టెట్టా, ఈ గడ్డం అప్పుడు తీస్తారా?

Kadapa TDP Leader Satish Reddy Pledge

11:48 AM ON 16th August, 2016 By Mirchi Vilas

Kadapa TDP Leader Satish Reddy Pledge

కొందరు భీషణ ప్రతిజ్ఞ చేస్తే, దానికి గుర్తుగా ఎదో ఒకటి కనిపించేలా చేస్తారు. ఇక సినిమాల్లో అయితే దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు సినిమా షూటింగ్ సమయంలో గెడ్డం పెంచడం మొదలెట్టి , ఆఖరున గెడ్డం తీసేస్తారు. ఇది ఆనవాయితీ గా మారింది. ఇలాంటి ఘటనలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ రాజకీయ నేత మాత్రం తమ ఊరికి నదీ జలాలు తెచ్చాకే గెడ్డం తీస్తానని ప్రకటించారు. వైసిపి నేత జగన్ ప్రత్యర్థి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ అయిన టిడిపి నేత సతీష్ రెడ్డి ఈ విషయంలో పట్టుదలగా వున్నారు. ఈ ఏడాది ఆఖరుకు ఎట్టి పరిస్థితుల్లోను పులివెందులకు కృష్ణాజలాలు రప్పించి, సస్యశ్యామలం చేస్తామని దీక్ష పూనారు. అప్పుడే గడ్డం తీస్తానని స్పష్టం చేశారు. వేంపల్లెలో ఉన్న సతీష్ రెడ్డిని నియోజకవర్గంలోని పలువురు నాయకులు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. గండికోటకు అక్కడి నుంచి పులివెందుల ప్రాంతానికి నీళ్లు తెప్పించే విషయంపై ఆదివారం నీటిపారుదల శాఖ సీఈతో ఫోన్ లో మాట్లాడారు. పెండింగ్ పనుల పూర్తికి ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కడప జిల్లాలోని ప్రాజెక్టులను నీటితో నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు.

కాగా పట్టిసీమ వద్దు ప్రయోజనం లేదన్న జగన్ విష ప్రచారం బెడిసికొట్టిందని సతీష్ రెడ్డి పేర్కొన్నారు. పట్టిసీమ వల్ల ఎంత ప్రయోజనం ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించారని గతంలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం జగన్ మాట్లాడలేరని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:సాయంత్ర సమయంలో ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి ఉండదట

ఇవి కూడా చదవండిబంగారు పతకం...దొంగల బారిన పడ్డాడు

English summary

Kadapa Telugu Desam Party Leader Satish Reddy made a pledge on that when Krishna River Water will come to Pulivendula then he will shave his beard.He also fired on YSRCP president Y.S.Jagan Mohan Reddy.