సెంట్రల్ జైల్ ని మరపించే హోటల్

Kaidi Kitchen Restaurant in Chennai

11:15 AM ON 5th July, 2016 By Mirchi Vilas

Kaidi Kitchen Restaurant in Chennai

ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఏ రంగమైనా రూపాంతరం చెందాలిసిందే. ఇక హోటల్ బిజినెస్ లో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. తాజాగా జైలుని తలపించేలా ఓ హోటల్ రూపుదిద్దుకుంది. ఇటీవలకాలంలో ఏదో ఒక కేసులో రాజకీయ, బిజినెస్ మేన్, సెలబ్రిటీలు జైలు కెళ్లిరావడం తరచు వార్తల్లోకి వస్తున్న నేపథ్యంలో ఇదే ట్రెండ్ ని తనకు అనుకూలంగా ఓ రెస్టారెంట్ యజమాని మలచుకున్నాడు. దీంతో అచ్చం జైలుని తలపించేలా చెన్నైలోని మైలాపూర్ లో ఓ హోటల్ ని కట్టేశాడు.

బయట గేటు చూస్తే అచ్చం సెంట్రల్ జైలు ముఖ ద్వారంలా వుంటుంది. లోపలికి వెళ్లి చూస్తే ఇంద్రభవనాన్ని తలపిస్తుంది. రెండు అంతస్తులు, అందులోని జైలు గదులు.. జైలు మాదిరిగా వుండే కటకటాలు, వాటికి వేలాడే బేడీలు, కటకటాల వెనుక టేబుల్స్ దర్శనమిస్తాయి.

ఇక సర్వర్లు.. ఖైదీల మాదిరిగా .. వార్డెన్లు... సూపర్ వైజర్లు మాదిరిగా వుంటారు. ఈ రెస్టారెంట్ లో ఏది చూసినా అంతా జైలు వాతావరణం కనిపిస్తోంది. ఇక మర్యాదకు ఏమాత్రం లోటు రాదట. ఇంతకీ ఖైదీ కిచెన్ బ్యాక్ స్టోరీ గురించి వివరాల్లోకి వెళ్తే,

బెంగాల్ కు చెందిన ఆదిత్య, రీచా దంపతులు ఈ హోటల్ ని నిర్మించారు. వీళ్ల పూర్వీకులది బెంగాల్ అయినా చెన్నైలోనే పుట్టి పెరిగారు. ఓసారి తన బంధవులతో కలిసి ఆదిత్య దంపతులు కోల్ కతాలోని ఓ హోటల్ ని సందర్శించారు. దాని పేరు ఖైదీ కిచెన్.. అక్కడి సిబ్బంది, పనిచేసే తీరుచూసి, ఆదిత్య ఆశ్చర్యపోవడంతో ఇలాంటి హోటల్ ని చెన్నైలో ఏర్పాటు చేయాలని తలచాడు. అంతే వెంటనే కోల్ కతా హోటల్ నిర్వాహకులతో మాట్లాడారు. ప్లాన్ అమలు చేశారు.

తొలుత తమ హోటల్ నేమ్ ని వినియోగించుకునేందుకు ససేమిరా అన్నా, కంటిన్యూగా వచ్చే కస్టమర్స్ అని తెలియడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో మైలాపూర్ లో ఏర్పాటు చేసిన ఈ హోటల్ ని 10 కోట్ల రూపాయలు వెచ్చించారట. ఈ ఖైదీ కిచెన్ లో సాధారణ డిన్నర్ హాలులోపాటు 8 జైలు గదులున్నాయి. 100 మంది సిబ్బంది ఇందులో పనిచేస్తున్నారు.

ఇక్కడ ఓన్లీ శాఖాహారం మాత్రమే సప్లై చేస్తారు. పొరపాటున ఆల్కహాలుని లోనికి అనుమతించరు! ఇండియాలోని వివిధ ప్రాంతాల వంటకాలతోపాటు 11 దేశాలకు చెందిన విదేశీ ఫుడ్ మెనూ ఖైదీ కిచెన్ లో కొలువుదీరడం విశేషం. బావుంది కదా కాన్సెప్ట్.

1/9 Pages

English summary

Kaidi Kitchen Restaurant in Chennai