ఇండస్ట్రీలో గౌరవం పోయిందంటున్న కైకాల

Kaikala Satyanarayana latest interview for his birthday

10:53 AM ON 25th July, 2016 By Mirchi Vilas

Kaikala Satyanarayana latest interview for his birthday

సినీ ఫీల్డ్ ఓ మాయా ప్రపంచం లైమ్ లైట్ లో వున్నంతకాలమే ఎవరినైనా పట్టించుకునేది. ఎన్నో వందల చిత్రాల్లో నటించి వివిధ పాత్రలతో మెప్పించిన నవరస నటనాసార్వభౌమ కైకాల సత్యనారాయణ పరిస్థితి ఇప్పుడిలా తయారయింది. తెలుగు సినిమాల్లో హీరో, విలన్, కమీడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా పలు పాత్రల్లో నటించి, ఏ రసాన్నయినా అవలీలగా పలికించగల నవరస నటనా సార్వభౌముడు, తెలుగు సినిమా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అయిన తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ సత్యనారాయణకు టాలీవుడ్ లో పాత్రలకు సంబంధించి ఎలాంటి పిలుపు లేదట.

వాస్తవానికి ఈ కమనీయుడికి 2012లో వచ్చిన దరువు సినిమా తరువాత మరే సినిమా లేదని చెప్పాలి. జూలై 25న తన పుట్టినరోజు సందర్భంగా కైకాల మీడియాతో పలు విషయాలు పంచుకొన్నారు. ఇండస్ట్రీ తనలాంటి సీనియర్లను సరిగా గౌరవించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసారు. తనని ఎవరూ ఏ ప్రివ్యూకి గాని, ఆడియో ఫంక్షన్ కి గాని, అవార్డ్ ఫంక్షన్ కి గాని పిలవడం లేదని అనేసారు. తమ రోజుల్లో సీనియర్లకు ఎంతో గౌరవం ఇచ్చేవారమని ఇప్పుడు ఆ విధంగా జరగడం లేదని ఆవేదన చెందారు.

English summary

Kaikala Satyanarayana latest interview for his birthday