నే  పట్టిందల్లా బంగారం కాదు

Kajal About Her Film Carrer

07:06 PM ON 8th February, 2016 By Mirchi Vilas

Kajal About Her Film Carrer

పదేళ్లుగా చిత్రసీమలో కొనసాగుతున్న కథానాయిక కాజల్‌, చిత్రసీమలో అన్ని విషయాల్లో అనుభవం ఉపయోగపడదని అంటోంది. దక్షిణాదిలో అగ్రతారగా మంచి అవకాశాలు అందుకొంటూనే హిందీలోనూ రాణించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం మహేష్‌బాబు, పవన్‌కల్యాణ్‌లాంటి అగ్ర హీరోల సరసన చిందేస్తోంది. 'మీరు చాలా కాలంగా హీరోయిన్ గా కొనసాగుతున్నారు, ఇటీవల కథల ఎంపిక విషయంలో మీ ఆలోచనలేమైనా మారాయా?' అని అడిగితే, 'అనుభవమున్న హీరోయిన్ గా ప్రేక్షకులు నా సినిమాలపై అంచనాలు పెంచుకోవచ్చు. అయితే నేను పట్టిందల్లా బంగారం కాదు. నా దృష్టిలో అనుభవం అనేది పాత్రల్ని మరింత బాగా అర్థం చేసుకొని నటించడానికి పనికొస్తుందంతే. కథల ఎంపికలో మాత్రం ఇప్పటికీ నేను నా మనసు చెప్పినట్టే వింటా. నిజం చెప్పాలంటే అనుభవం కన్నా నాలోని స్పష్టతే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందని నమ్ముతా. పరిశ్రమలోకి వచ్చిన తొలి రోజుల్లో నేను ఏం చేయాలో నాకు పూర్తి తెల్సేది కాదు. ఇప్పుడు ఆ స్పష్టతకి అనుభవం తోడయింది. అదే నాకు బాగా కలిసొస్తోం ది’’ అని ఈ భామ చెబుతోంది. మొత్తానికి అబ్బో పెద్ద లెక్చర్ దంచేస్తోంది. అందుకే కాజల్ మాటలు నేర్చిందని అందరూ అనుకుంటున్నారు.

English summary

South Top Heroine Kajal Agarwal says about her film career.She says that she has faced too many difficulties in her film career