కాజల్ అందం వెనుక కధ అదా ...

Kajal About The Secret Behind Her Beauty

10:27 AM ON 17th February, 2016 By Mirchi Vilas

Kajal About The Secret Behind Her Beauty

వెండి తెరపై అందంగా కనిపించడానికి కాజల్‌ పడే ఆరాటం ఎంతో వుంది. అందుకే తొలి సినిమా నుంచి ఆమెకి గ్లామర్ మెయింటెన్ చేస్తూ, మంచి మార్కులే కొట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే అందంగా కనిపించే నెపంతో ఎప్పుడూ హద్దులు దాటలేదట. పైగా కమర్షియల్ టచ్తో ప్రధానంగా సినిమాలు రూపొందే తెలుగు చిత్రసీమలో, ఒక కథానాయిక దాదాపు పదేళ్లుగా నియమం పెట్టుకుని రాణించడం ఆషామాషీ వ్యవహారం గా కొట్టి పారెయ్యలేం కదా! ఇదే విషయాన్ని ప్రస్తుతం ఆమె పవన్‌కల్యాణ్‌తో కలిసి ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’లో, మహేష్‌తో ‘బ్రహ్మోత్సవం’లో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ దగ్గర ప్రస్తావిస్తే, ‘అవన్నీ సీక్రెట్స్ ’ చెప్పేస్తే ఎలా అంటూనే విషయం బయట పెట్టేసింది. ‘‘ముఖ్యంగా ప్రేక్షకులు చాలామంది హీరోయిన్ని అందం అనే కోణంలోనే చూస్తారు. వాళ్లకి ప్రతీ సినిమాలోనూ కొత్త కొత్తగా కనిపిస్తూ కవ్వించాలి. అయితే చాలా మంది హీరోయిన్లు నాలుగైదు సినిమాలు చేసేసరికి కొత్తగా ఎలా కనిపించాలో అర్థం కాదు. దీంతో దుస్తులు ధరించే విషయంలో హద్దులు దాటుతుంటారు. ఎక్స్ పోజింగ్ చేసేస్తారు. అదే మార్గం అనుకుంటారు. అయితే కురచ దుస్తులు ధరిస్తేనే హీరోయిన్ అందంగా కనిపిస్తుందనుకోవడం పొరపాటే. టీషర్ట్‌, జీన్స్‌ ప్యాంటు వేసినా గ్లామర్ కి ఇబ్బంది వుండదు. ఆ ధీమా ఇప్పటికీ నాకుంది. ఇక చీర కట్టుతోనే అందం అంటే ఏంటో చాటి చెప్పొచ్చు. ఇలాంటి కిటుకులన్నీ ఇండస్ట్రీ కి వచ్చిన నాకు తొలి రోజుల్లోనే తెలిసిపోయాయి. వాటిని ఫాలో అయిపోతున్నా' అంటూ కాజల్‌ అన్ని విషయాలు చెప్పేసింది.

English summary

Beautiful heroine Kajal Agarwal says about her beauty secret.She says that beauty was not come by wearing short dress and exposing.Beauty was there in Saree also.