అందుకే, నో.. అనలేకపోయిందట!

Kajal Agarwal doing guest role in Sundeep Kishan movie

10:29 AM ON 9th June, 2016 By Mirchi Vilas

Kajal Agarwal doing guest role in Sundeep Kishan movie

సందీప్ కిషన్ తో టాలీవుడ్ చందమామ కాజల్ నటిస్తోందా? అంటే, ముమ్మాటికీ అవుననే ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ అమ్మడు ఒప్పుకోవచ్చు కానీ, స్టార్ హీరోలతో సినిమాలు చేసిన కాజల్, వున్నట్లుండి యంగ్ హీరోతో ఓకే ఎలా చేసింది? ఇంతకీ ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? ఇలా అనే ప్రశ్నలు సినీ లవర్స్ లేవనెత్తుతున్నారు. విషయం ఏమంటే, సందీప్ కిషన్-రెజీనాలతో కృష్ణవంశీ నక్షత్ర మూవీని తెరకెక్కిస్తున్నాడు. గతంలో ఈ డైరెక్టర్ తెరకెక్కించిన చందమామ చిత్రంతో కాజల్ లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది.

అయితే నక్షత్ర మూవీలో గెస్ట్ రోల్ కి కాజల్ ని తీసుకున్నారట. ఇందుకోసం 15 రోజులపాటు కాల్షీట్లు కూడా ఇచ్చిందని అంటున్నారు. ఇక రీసెంట్ గా పవన్ తో సర్దార్ గబ్బర్సింగ్, ప్రిన్స్ తో బ్రహ్మోత్సవం లాంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడడంతో ఈమె గ్లామర్ కెరీర్ అయిపోయిందంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో కృష్ణవంశీ.. ఆమెని సంప్రదించి, నక్షత్ర మూవీ స్టోరీ చెప్పడంతో ఓకే చేసిందట. అయితే ఇందుకోసం రెమ్యునరేషన్ బానే ముట్ట జెప్పినట్టు ఇన్ సైడ్ టాక్. సందీప్ పక్కన హీరోయిన్ రెజీనా కాగా, గెస్ట్రోల్ కే కాజల్ పరిమితమైనట్టు తెలుస్తోంది.

ఇలా యంగ్ హీరోలతో స్టార్ హీరోయిన్స్ సినిమాలు చేసిన సందర్భాలు టాలీవుడ్ లో వున్నాయని కాజల్ అభిమానులు చెబుతున్నారు. సమంత, తమన్నాలు సైతం అల్లుడుశీను మూవీలో నటించిన విషయాన్ని ఇక్కడ గుర్తుచేస్తున్నారు. అయినా కృష్ణవంశీ లాంటి డైరెక్టర్ రిక్వెస్ట్ చేయడంతో ఆమె నో చెప్పలేకపోయిందని అంటున్నారు.

English summary

Kajal Agarwal doing guest role in Sundeep Kishan movie