సినిమా వాళ్ళని పెళ్లి చేసుకోనన్న టాప్ హీరోయిన్

Kajal Agarwal don't like to marry film industry people

11:24 AM ON 26th May, 2016 By Mirchi Vilas

Kajal Agarwal don't like to marry film industry people

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీకల్యాణం చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన కాజల్ అగర్వాల్ ఆ తరువాత కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ చిత్రంతో ఘనవిజయం అందుకుంది. ఆ తరువాత ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన మగధీర చిత్రంలో హీరోయిన్ గా నటించి రికార్డు హిట్ అందుకుంది. ఈ చిత్రంతో ఒక్కసారిగా అభిమానుల్ని విపరీతంగా సంపాదించుకుంది కాజల్. అయితే చాలా చిత్రాలతో అభిమానులకు స్వీట్ స్ట్రోక్ ఇచ్చిన కాజల్ పెళ్లంటే... ఫ్యాన్స్‌కు హార్ట్ స్ట్రోక్ ఇస్తుంది. ఆ విషయమే కాజల్‌ను అడిగితే.. అప్పుడే కాదులేండి... అంత తొందరెందుకు అని నవ్వుతూ సమాధానమిచ్చింది.

కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ ఐ లవ్ యూ చెప్తే కాదనేవారు ఉంటారా? మూడేళ్ల నుంచి నేను సింగిల్. మళ్లీ నా మనసుకు నచ్చిన వ్యక్తి కనబడినప్పుడు మాత్రం అతనితో ప్రేమలో పడతాను. ఆ టైమ్‌లో కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. మీరనుకుంటున్నట్లు నేను సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకోను. భార్యాభర్తలిద్దరిదీ వేర్వేరు వృత్తులైతే వారి మధ్య అనుబంధం మరింత బలంగా ఉంటుంది అని పెళ్ళి గురించి, ఎదురుచూస్తున్న పెళ్ళికొడుకు గురించి చెప్పుకొచ్చింది కాజల్. సినిమాల్లో కాజల్ రొమాంటిక్ లుక్స్‌తో అభిమానులకు వేడి పుట్టిస్తుంది. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం నేను అంత రొమాంటిక్ కాదు.

నేను సినిమాల్లో హీరోలతో రొమాన్స్ చేయను. నాకంటూ కొన్ని పరిధులు ఉన్నాయి. ఇక, నిజజీవితంలో కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి అతనికి ఐ లవ్ యూ చెబుతూ కూర్చోలేను. అలాగని ఏదో స్ట్రిక్ట్‌గా కూడా ఉండను. ఇద్దరి మధ్య సరైన అవగాహన ఉంటే మనం ఎలా ఉన్నా సరే ఎదుటివారు అర్థం చేసుకుంటారు అని చెప్పుకొచ్చింది. అదలా ఉంటే, మూడేళ్ల నుంచి సింగిల్ అని కాజల్ చెప్పింది కదా... మరి అంతకు ముందు కాజల్ ఎవరితో ప్రేమాయణం జరిపిందని అభిమానులు ఆరాలు తీస్తున్నారు.

English summary

Kajal Agarwal don't like to marry film industry people