కొరటాలతో గొడవపడి షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోయిన కాజల్.. కారణమేంటో తెలుసా?

Kajal Agarwal gave shock to Janatha Garage team

05:36 PM ON 22nd August, 2016 By Mirchi Vilas

Kajal Agarwal gave shock to Janatha Garage team

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. ఈ చిత్రం ఆడియోను ఈ నెల 12న విడుదల చేశారు. ఆ ఆడియో వేడుకలోనే సెప్టెంబర్ 2న విడుదల చేస్తామని డేట్ కూడా అనౌన్స్ చేసేసారు. దీంతో సినిమా రిలీజ్ కు దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ అంతా ఆ పనులలో ఉండగా.. ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేస్తున్న కాజల్ చిత్ర యూనిట్ కు షాక్ ఇచ్చింది. డ్రెస్ విషయంలో దర్శకుడితో గొడవ పడ్డ కాజల్, ఆ గొడవ కాస్త పెద్దది కావడంతో కాజల్ కోపంతో షూటింగ్ మధ్యలోనే బయటకు వచ్చి ఎయిర్ పోర్ట్ కు వెళ్లిపోయిందట.

కాజల్ ను పట్టుపట్టి మరీ ఈ స్పెషల్ సాంగ్ కు తీసుకున్న ఎన్టీఆర్ ఈ సంఘటనతో ఖంగు తిన్నాడట. మూడు రోజులుగా ఈ ఐటమ్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సాంగ్ లో కాస్ట్యూమ్స్ విషయంలో కాజల్ కొన్ని కండీషన్స్ పెట్టిందట. సాంగ్ లో వైట్ కాస్ట్యూమ్స్ వేసుకోనని ఆమె చెప్పినా చిత్ర యూనిట్ మళ్లీ అదే కాస్ట్యూమ్స్ ఇవ్వడంతో ఆమె ఫైర్ అయిందని సమాచారం. కొంతమంది మాత్రం కాస్ట్యూమ్స్ గురించి కాదు వేరే ఉందని ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనా కాజల్ ఇలా షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోవడంతో ఎన్టీఆర్ కు కొరటాల శివకు ఏమీ అర్ధం కావడంలేదట. ఇప్పుడు ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం!

English summary

Kajal Agarwal gave shock to Janatha Garage team