కాజల్ ఇలా హడలు గొడుతూ రివేంజ్ తీర్చుకుంటోందా ?

Kajal Agarwal In a New Horror Look

10:40 AM ON 4th August, 2016 By Mirchi Vilas

Kajal Agarwal In a New Horror Look

ఎవరికైనా కాలం కల్సి రాకపోతే ఎన్ని మాటలైనా పడాలి. ఎన్ని అవమానాలైనా భరించాలి. సరిగ్గా ఇదే పరిస్థితి ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగువెలిగిన కాజల్ అగర్వాల్ కి ఎదురైంది. ఇటీవల చేసిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో, కాజల్ పనైపోయిందని కామెంట్లు మొదలైపోయాయి. దీనికి తోడు ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ మూవీలో ఐటెం సాంగ్ ని దృష్టిలో ఉంచుకుని, కాజల్ అవకాశాలులేక స్పెషల్ సాంగ్స్ చేస్తుందంటూ టాలీవుడ్ లో ఒకటే గుసగుసలు. ఇదంతా ఏంకాదంటూ ఇప్పుడు కాజల్ కు ఛాన్సుల మీద ఛాన్సులు వచ్చిపడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో నటించే అనూహ్య అవకాశం ఈ బ్యూటీని వరించింది. ఇక తమిళంలో మూడు నాలుగు చిత్రాలతో బిజీ అయిపోయింది. అంతేకాదు, డేట్స్ ఖాళీలేక విక్రమ్ సినిమా కూడా వదులుకున్న పరిస్థితి.

ప్రస్తుతం జీవాకు జంటగా కవలైవేండామ్ మూవీలో కాజల్ నటిస్తోంది. అలాగే అజిత్ 57వ సినిమాలోనూ.. రానాకు జంటగా మరో తెలుగు మూవీలోనూ కాజల్ నటించబోతోంది. ఇలా వరుసగా టాప్ హీరోలతో జతకడుతూ కాజల్ తమిళం,తెలుగు భాషలలో మరో రౌండ్ కు సిద్ధమైంది. ఇలా బిజిబిజీ అయిపోయిన కాజల్ తాజాగా పోస్ట్ చేసిన పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. స్పెషల్ సాంగ్ చేస్తూ కొత్త స్టెప్ తీసుకున్న కాజల్, హర్రర్ మూవీలో కూడా నటిస్తుందా అంటూ డౌట్లు మొదలైపోయాయి. 'ఒప్పో' ఫోన్ లను ప్రమోట్ చేయడంలో భాగంగానే కాజల్ ఆ కంపెనీ ఫోన్ తో కొత్త లుక్ లో కనిపించి అట్రాక్ట్ చేస్తుంది. అదండీ ఈ పిక్ లోని ఆంతర్యం.

ఇవి కూడా చదవండి:ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ చూపిస్తా!

ఇవి కూడా చదవండి:అమలాపాల్ విడాకులకు కారణం చెప్పిన మామ!

English summary

Heroine Kajal Agarwal was in full busy with her films and she signed two films in telugu and three films in tamil and she was busy with her films and recently she posted a pic of her and she was looking in a horror look in the picture.