పవన్ కి ఫోర్త్ వైఫ్ కూడానా?!

Kajal Agarwal is the fourth wife for Pawan Kalyan

05:52 PM ON 4th April, 2016 By Mirchi Vilas

Kajal Agarwal is the fourth wife for Pawan Kalyan

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కు టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ పేరు చెబితే చాలు అభిమానులు ఊగిపోతారు, మా దేవుడు అంటూ కొలుస్తారు. ఎందుకంటే ప‌వ‌న్‌కు ఫ్యాన్స్ కన్నా భ‌క్తులే ఎక్కువ‌. ఇదిలా ఉంటే పవన్ తాజాగా నటించిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ ఏప్రిల్ 8న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఇందులో పవన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం సాంగ్స్ షూటింగ్ కోసం పవన్-కాజల్ స్విట్జ‌ర్లాండ్ వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే కాజల్ అక్కడ పాటల చిత్రీకరణ సమయంలో పవన్‌తో దిగిన ఫొటో త‌న ఫేస్‌బుక్‌లో పెట్ట‌డం ఇప్పుడు అది పెద్ద వివాస్ప‌ద‌మైంది.

దీని పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అవేంటంటే ఈ ఫోటో లు చూసిన నెటిజ‌న్లు కాజ‌ల్‌కు చాలా స‌ల‌హాలు ఇస్తున్నారు. నీ పక్కన ఉన్నది ఎవరు.. నీ అసిస్టెంటా? అని కొందరు కామెంట్లు పెడుతుంటే.. మ‌రికొంద‌రు అత‌డికి మ‌రీ అంత క్లోజ్‌గా ఉండకు.. నువ్వు ఫోర్త్ వైఫ్ అయిపోతావ్ అని వివాదాస్పదమైన కామెంట్లు చేస్తున్నారు. దీనితో పాటు ఇంకా దారుణంగా నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావు.. నీ పక్కన ఉన్న ఆ మూసలోడు ఎవరని కామెంట్లు పెట్టారు. అంతే దీనితో పవన్ అభిమానులు కాజల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అస‌లు నువ్వు ఆ ఫొటోలు ఎందుకు పెట్టాలి? మా అభిమాన హీరో పై కామెంట్లు చేసేందుకు నువ్వెందుకు ఛాన్స్ ఇవ్వాల‌ని దుమ్మెత్తి పోస్తున్నారు.

English summary

Kajal Agarwal is the fourth wife for Pawan Kalyan. Pawan anti fans puts comments for Kajal Agarwal photos.