'పక్కా లోకల్' అంటూ కాజల్ ఇరగదీసింది(వీడియో)

Kajal Agarwal pakka local song teaser from Janatha Garage

11:03 AM ON 1st September, 2016 By Mirchi Vilas

Kajal Agarwal pakka local song teaser from Janatha Garage

చంటిగాడు లోకల్ అనే డైలాగ్ విన్నాం కానీ, పక్కా లోకల్ అంటూ కాజల్ అగర్వాల్ ఇరగదీసింది. ఇంకొన్ని గంటల్లోనే జనతా గ్యారేజ్ షోలు పడిపోతున్నాయనగా, కొన్ని గంటల ముందు కాజల్ ఐటెం సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇక సినిమాలో చివరి ఘట్టంలో ఈ భామ ఐటెం సాంగ్ వస్తుంది. పెళ్లి పనుల్లో జోరుమీదున్న వాళ్ళను ఖుషీ చేయడానికి ఈ మూవీలో పాట పెట్టారు. ఈ పాటలో కాజల్ ఊపు మామూలుగా లేదు. ఓ రేంజిలో ఒక ఊపు ఊపేసింది చందమామ. కాజల్ ఇప్పటిదాకా తన కెరీర్లో ఎన్నడూ వేయనంత ఊపుతో డ్యాన్స్ చేసింది అంటే అతిశయోక్తి ఏమీ లేదు. మొత్తంగా ఈ పాటలో ఎన్టీఆర్ కూడా జత కట్టి స్టెప్పులతో కుమ్మేసాడు.

ఒకటే ఈలలు చప్పట్లు... యమ స్పీడుగా స్టెప్పులేస్తూ... నడుం వంపులతో మతి పోగొడుతూ.. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు కిక్కించింది కాజల్. స్పెషల్ సెట్టింగ్ లో నైట్ ఎఫెక్ట్ లో ఈ పాట చిత్రీకరించారు. విజువల్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. ఈ పాట రిలీజవడం ఆలస్యం పక్కా లోకల్ అనే హ్యాష్ ట్యాగ్ నేషనల్ లెవెల్లో ట్రెండవుతుండటం విశేషం. సినిమా మీద అంచనాల్ని మరింత పెంచేలా ఉన్న ఈ పాట చూశాక.. అభిమానులు ఆగడం కష్టం. ఈ పాట వచ్చినపుడు థియేటర్లు మోతెక్కిపోతాయి.

ఇది కూడా చదవండి: 'జనతా గ్యారేజ్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చదవండి: జుట్టుకు రంగేసుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఇది చదవండి..

ఇది కూడా చదవండి: ఇది తాగితే ఎలాంటి వాడైనా గుండెపోటు నుంచి తప్పించుకోవచ్చు!

English summary

Kajal Agarwal pakka local song teaser from Janatha Garage. Kajal Agarwal hot item song from Janatha Garage.