నాన్ వెజ్ ఎక్కువ తినేసి, కాజల్ అలా చేస్తోందా?

Kajal Agarwal Says That She Likes Chicken

12:36 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Kajal Agarwal Says That She Likes Chicken

‘గన్నుల్లాంటి కనులు’ ఉన్న కాజల్ తెలుగులోకి అడుగుపెట్టి దాదాపు దశాబ్దం గడుస్తున్నా కాజల్‌ ‘దూకుడు’ ఏమాత్రం తగ్గలేదు అలనాటి ‘లక్ష్మీకల్యాణం’ నుంచి రాబోయే ‘బ్రహ్మోత్సవం’ వరకూ గ్లామర్‌ విషయంలో తోటి హీరోయిన్లకు ఎప్పటికప్పుడు సవాలు విసురుతూ ఎవర్‌గ్రీన్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఈ మధ్యే మెగాస్టార్ చిరంజీవి సర్దార్ వేడుకలో ‘చందమామ’తో పోల్చాడు. ముఖమంతా పరుచుకునే చిరునవ్వుతో , పిడికిట ఇమిడే నడుము, యువరాణిని పోలిన హుందాతనం, మేళవించిన కాజల్‌ను టాలీవుడ్‌ క్వీన్‌ గా ఏలుతోంది. అయితే తీరిక దొరికేతే చాలు, పుస్తకాలు చదివేస్తుందట. 'పుస్తకాలు నా నేస్తాలు. ఆ తరువాత దూర ప్రయాణాలు. బీచ్‌ ఉండే ప్రదేశాలంటే చాలా ఇష్టం. బీచ్‌ చూడగానే చిన్న పిల్లలాగా మారిపోతా. నేనొక హీరోయిన్‌ని అన్నవిషయమే గుర్తుకు రాదు' అని చెబుతోంది.

ఇవి కూడా చదవండి : టాప్ లెస్ గా సెల్ఫీ దిగిన లేడీ పోలీస్

ఈ అమ్మడు ఇంత నాజూకుగా ఉండడానికి కారణం ఏమంటే, 'తినాలని అని పించినవి తినేస్తూంటాను. నేను మాంసాహార ప్రియురాల్ని. ఆ మధ్య కొన్ని రోజులు నాన్‌ వెజ్‌ మానేశాను. కానీ తినకుండా ఉండడం నావల్ల కాలేదు. తిరిగి మొదలెట్టేశా. ఎక్కువగా తింటే, ఆరోజు కొంచెం ఎక్కువగా వ్యాయామం చేస్తా. లేకపోతే ప్రతిరోజూ గంటా, గంటన్నర వ్యాయామానికి కేటాయిస్తా' అని వివరించింది. వంట గురించి ప్రస్తావిస్తే,'సినిమాల్లోకి రాకపోతే అలాగే చేసే దాన్నేమో! ఇప్పుడు ఆ ఛాన్స్‌ లేదు. కొన్నిసార్లు తినేందుకే టైముండదు. ఇక చేయడం ఎక్కడ కుదురుతుంది? కొన్ని ఐటెమ్స్‌ మమ్మీ దగ్గర నేర్చుకున్నా. అవి బాగా చేస్తానని నా ఫ్రెండ్స్‌ అంటూంటారు' అని చెబుతోంది ఈ అమ్మడు .
ఇవి కూడా చదవండి :

చిరుకు షాకిచ్చిన ఉపాసన

డబ్బివ్వకుంటే కలిసున్న ఫోటోలు నెట్లో పెడతా

కూతుర్ని రేప్ చేసాడని ఆ కామాంధుడు చేతులు నరికేసిన తండ్రి

English summary

Heroine Kajal Agarwal Says that when She was free she will read books and she will cook food and she says that she was the fan of Chicken and she likes to cook food. Presently she was acting in "Brahmotsavam" movie with Mahesh Babu.