క్లాసులు ఎగ్గొట్టి  ...

Kajal Aggarwal About Her Childhood Memories

10:00 AM ON 14th March, 2016 By Mirchi Vilas

Kajal Aggarwal About Her Childhood Memories

పలు అగ్రహీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్కా జల్ అప్పుడప్పుడు చిన్ననాటి విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుని తెగ మురిసిపోతూ వుంటుంది. తాజాగా కొన్ని విషయాలను ప్రస్తావించింది. చదువుకునే రోజుల్లో అల్లరి పిల్లగా ముద్రపడిన ఈ ముద్దుగుమ్మ చిన్నప్పుడు చేసే అల్లరికి అంతూ పొంతూ ఉండేది కాదట. స్కూల్లో, ఇంట్లో... ఎక్కడపడితే అక్కడ ఈ అమ్మడి హంగామా కనిపించేదట. ఇక ఆమె చెల్లి నిషాని క్షణం కుదురుగా ఉంచేదాన్ని కాదని కూడా చెబుతోంది. "స్కూల్లో నాపై అల్లరి పిల్ల అనే ముద్ర పడిపోయింది. కాలేజీలోనూ నేనేం మారలేదు. క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లిపోయేదాన్ని. ఓసారి ఈ విషయం కాలేజీ యాజమాన్యానికి తెలిసిపోయింది. ప్రిన్సిపల్‌ క్యాబిన్‌కి పిలిచి వార్నింగ్‌ ఇచ్చారు. మా జూనియర్లను ర్యాగింగ్‌ చేసేదాన్ని. అది సరదాగానే ఉండేది. ఆఖరికి మా చెల్లినీ వదల్లేదు. అందుకే అమ్మతో రోజూ నాకు చివాట్లే పడేవి. అయినా ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలి కదా" అంటూ అమాయకంగా కాజల్ చెప్పేస్తోంది. "నా మట్టుకు స్కూలు, కాలేజీ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ ఆ రోజుల్లోకి వెళ్లిపోవాలనిపిస్తుంటుంది’’ అని అంటోంది. ఇంతకీ ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సర్దార్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే కదా.

English summary

One of the top heroine in South film industry Kajal Agarwal remembers her child hood memories during an interview.She says that she was very energetic in her childhood days.She also said that she used to go movies by bunk college.