చిన్నారి కాజల్

Kajal Childhood Photo

10:30 AM ON 25th February, 2016 By Mirchi Vilas

Kajal Childhood Photo

పెద్దయ్యాక చిన్ననాటి జ్ఞాపకాలను మరిచిపోకుండా తలచుకుంటూ మురిసిపోయింది. ఓ సినీ భామ. చిట్టి గౌను ధరించి చేతిలో పువ్వు పట్టుకుని కూర్చుని భలే ముద్దొస్తోంది కదూ. పెద్దయ్యాక అందాల భామగా మారిన ఈ చిన్నారి ఎవరో తెలుసా?... ఈమె ఎవరంటే ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి కాజల్‌. తన చిన్ననాటి మధురానుభూతులను గుర్తు చేసుకుంటూ ఇలా ఈ ఫొటోను సోషల్‌మీడియా ద్వారా పంచుకుంది. ‘చిన్నప్పటినుంచే పోజులిచ్చేదాన్ని... నా చేతిలో ఆ పువ్వు ఎందుకు పట్టుకున్నానో తెలియట్లేదు’ అంటూ పోస్ట్‌ చేశారు. దీనికి అభిమానులు తెగ లైక్‌లు కొట్టేస్తూ... బోలెడన్ని కామెంట్స్‌ పెట్టేస్తున్నారు. చిన్నప్పటికీ ఇప్పటికీ కాజల్‌ ఏమీ మారలేదని, తన కళ్లు చాలా అందంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు కాజల్‌ చేతిలోని ఆ పువ్వు తమ కోసమేనంటూ అభిమానులు సరదాగా కామెంట్స్‌లో పేర్కొనడం కొసమెరుపు ...

English summary

Heroine kajal Agarwal has posted her childhood pic in Facebook by holding flower in her hand.This photo has got attracted by many of her fans.