అమ్మమ్మే గెస్ట్ ...      

Kajal Grandmother Suprises Kajal At Shooting Spot

06:06 PM ON 30th January, 2016 By Mirchi Vilas

Kajal Grandmother Suprises Kajal At Shooting Spot

హీరో హీరోయిన్లు సిన్మా షూటింగ్ లు జరుగుతుంటే, ఎవరెవరో గెస్ట్ లు రావడం , బంధు మిత్రులు అతిధులుగా రావడం రివాజు. అయితే నటి కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్న చిత్రం షూటింగ్ కి ఓ విశిష్ట అతిధి వచ్చిందట. ఇక ఆమె ఆనందానికి అవడ్డుల్లేవ్. నటుడు జీవా సరసన ‘కవలై వేండమ్‌’ అనే తమిళ హాస్య చిత్రంలో నటిస్తున్నారు. తమిళనాడులోని నీలగిరి కొండల్లోని కూనూర్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సెట్స్‌లో షూటింగ్‌ చూసేందుకు కాజల్ అమ్మమ్మ వచ్చిందట. దీంతో ఉబ్బి తబ్బిబ్బయింది. ఇలా రావడం ఎంతో ఆనందంగా ఉందని సంబరపడిపోయిన కాజల్ చిన్నపిల్లలా ఆమె ఒడిలో చేరిపోయింది. ఈ ఫొటోలను ఫేస్‌బుక్‌లో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటి వరకు తన సెట్స్‌కి వచ్చిన అతిథిల్లో ఈ అతిథి చాలా ప్రత్యేకమని, ఈమె ముందు నేను ఎప్పుడూ చిన్నపిల్లనే నని నటి కాజల్‌ అగర్వాల్‌ అంటోంది.

English summary

One of the top South Indian Actress Kajal Aggarwal was surprised by her grand mother at the shooting spot.Presently Kajal was acting with Hero Jeeva in ?Kavalaivendam? movie.Kajal Grand Mother Attended to that shooting spot and make her happy