దానికి ఇంకా టైం ఉందంటున్న చందమామ

Kajal Interview About Her Marriage

12:31 PM ON 14th May, 2016 By Mirchi Vilas

Kajal Interview About Her Marriage

మెగాస్టార్ చిరజీవి నుంచి సైతం కాంప్లిమెంట్ అందుకున్న తెలుగు సినిమా చందమామ కాజల్‌ చూపులతోనే కుర్రకారుని ఇట్టే ఆకర్షిస్తుంది. కేవలం అందమే కాదు... బోలెడంత ప్రతిభ కూడా ఆమె సొంతం. తొమ్మిదేళ్ల క్రితం ఎలా కనిపించిందో ఇప్పటికీ ఆ చెక్కు చెదరని అదే అందంతో ప్రేక్షకుల్ని అలరిస్తోన్న తాజాగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ ఈనెల 20న విడుదలవుతున్న నేపధ్యంలో ఓ పత్రికకు ఇంటర్యూ ఇచ్చింది. అందులో చాలానే విషయాలు పంచుకుంది.

ఇవి కూడా చదవండి: ఇంట్లో భార్యలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా?(వీడియో)

‘బ్రహ్మోత్సవం’ పేరుకు తగ్గట్టుగానే ఉత్సవంలా ఉంటుందని, ఈ వేసవిలో ఇంటిల్లిపాదీ కలిసి చూడటానికి ‘బ్రహ్మోత్సవం’ సరైన సినిమాఅని కాజల్ చెబుతోంది. "ఇక ఈ సినిమాలో నేను విదేశాల నుంచి వచ్చిన భారతీయ యువతిగా కనిపిస్తా. నా పాత్ర పేరు కాశీ. తాను అందరిలాంటి అమ్మాయి కాదు. స్వతంత్ర భావాలు కలిగిన యువతి. చాలా ప్రాక్టికల్‌. తన ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయి. అలాంటి పాత్రలో నటించడానికి కొంచెం కష్టపడాల్సొచ్చింది" అని ఈ ముద్దుగుమ్మ చెప్పింది.

ఇవి కూడా చదవండి: 'కబాలి' ని కొనలేక చేతులెత్తేసిన దిల్ రాజు

కుటుంబ కదా చిత్రాలంటే ఎక్కువ ఇష్టపడే ఈ అమ్మడు ఇప్పటికే ‘చందమామ’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘బృందావనం’, ‘గోవిందుడు అందరివాడేలే’ ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’. కుటుంబ నేపథ్యంలో సాగే సినిమాల్లోనటించింది. "కుటుంబం చుట్టూ వాతావరణమూ బాగుంటుంది. చాలామంది నటీనటులుంటారు, రోజూ పండగ వాతావరణంలో గడుపుతున్నట్టు ఉంటుంది" అని ఈ అమ్మడు అంటోంది.తెలుగులో తేజగారి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నా. తమిళంలో జీవా, విక్రమ్‌తో సినిమాలు చేస్తున్నా. హిందీలో చేసిన ‘దో లఫ్జోన్‌ కి కహానీ’ వచ్చే నెల్లో విడుదలవుతోంది. పెళ్లి గురించి ఎత్తితే మాత్రం ఈ అమ్మడు దానికి ఇంకా చాలా సమయం ఉందని నవ్వేస్తోంది.

ఇవి కూడా చదవండి: బాహుబలి కలెక్షన్స్ పై బన్నీ షాకింగ్ కామెంట్స్

English summary

Glamorous Heroine Kajal Agarwal was presently acting in Brahmotsavam Movie and She says that Brahmotsavam was good family entertainer and She says that all can see this cool family entertainer in Summer. She said that Presently she was acting in director Teja's Film in Telugu. She said that there was so much time for her marriage.