ఆ ఉద్దేశ్యంతో నా దగ్గరకు రాకండి: కాజల్

Kajal only agrees for extraordinory beat songs

12:10 PM ON 8th February, 2017 By Mirchi Vilas

Kajal only agrees for extraordinory beat songs

ఖైదీ నెంబర్ 150లో మెగాస్టార్ పక్కన కుమ్మేసిన కాజల్ ఇప్పుడు కొన్ని కండీషన్స్ పెడుతోందట. అసలు అలాంటి ఉద్దేశ్యంతో రావద్దంటూ ఓ విషయం గురించి కుండబద్దలు కొట్టేసింది. నాకు కిక్ ఇస్తేనే చేస్తా... ఇదేదో రవితేజ డైలాగ్ లా ఉందే అన్న అనుమానం వస్తోందా? డైలాగ్ రవితేజదే కానీ అన్నది మాత్రం కాజల్ . కాజల్ చేసిన ‘పక్కాలోకల్ ’ సాంగ్ కి విపరీతమైన ఆదరణ వచ్చింది. ఆ పాట చేస్తుంటే మంచి కిక్ వచ్చిందట! అలాంటి కిక్ ఇచ్చే పాటుంటే చెప్పండి, చేస్తాను. అంతే కానీ మా సినిమాలో ఐటెంసాంగ్ ఉంది చేయండి అంటూ నా దగ్గరకు రాకండి అంటూ గట్టిగానే చెబుతోందట! అయితే అన్ని పాటలూ అలాంటి కిక్ ఇవ్వాలంటే కష్టం కదా! అని కొందరు దర్శకనిర్మాతలు గొణుక్కుంటున్నారట. ఎవరేమనుకుంటే నాకేంటి అన్నచందంగా కాజల్ తన నిర్ణయం మీద నిలబడుతుందో లేదో చూడాలి

ఇది కూడా చూడండి: అందమైన చర్మానికి సింపుల్‌ చిట్కాలు

ఇది కూడా చూడండి: జుట్టురాలే సమస్యకు కరివేపాకు

English summary

Kajal Agarwal told that i will do only high beat songs like Pakka Local songs.